*నామ జపమహిమ*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
దక్షిణ భారతదేశమున పర్వతపురియను రాజ్యమును మణి పాలుడనేరాజు ఏలుచుండెను. క్రూరగుణం కలిగియుండిన అతనికి యుద్ధకాంక్ష ఎక్కువ. దానికి తోడుదురాశ అందులకు అతను దుర్మార్గము పాటించుటకు వెనుకాడడు. పలుదేశములపై దండెత్తి జయించి ఆ రాజ్యములో సిరిసంపదలను గొల్లకొట్టియు. ఆరాజులను బానిసలుగా చేసి , వారలను , హింసించి అవమానపరచు చుండేటి వాడు. అధర్మపరుడు కనుక అతనికి దైవభక్తియు పాపభీతియుగూడ లేకుండెను. అటువంటి మణిపాలుడు ఒకమారు మాళవదేశము యొక్క గొప్పతనమును ఆదేశములోని సిరిసంపదులు గూర్చి విని ఆదేశముపై పోరుకు బయలుదెరెను. మణిపాలుని ఎదుర్కొనుటకు ధర్మపాలకుడైన అనంతవర్మరాజు తన సేనాధిపతిని పంపించెను. మాళవదేశపు సేనాధిపతియగు సత్యవంతుడు మహాశాస్తావారి పరమభక్తుడు. అహర్నిశలు శ్రీస్వామివారి దివ్యనామములనే జపించుచుండువాడగును. యుద్ధముచేయుచుండు వేళగూడ *'శ్రీమహాశాస్తా శరణం'* అని చెప్పుచునే కరవాళమును విసిరి యుద్ధము చేయునట్టి మహాభక్తిమంతుడు.
అంతటి భక్తుడైన సత్యవంతుడు రాజుగారి అజ్ఞాను శిరసా వహించి యుద్ధమునుకు బయలుదేరెను. రణరంగమున అవలీలగ శత్రువులను పడదోసెను. ఆతని సైన్యము సంఖ్యలో చాలాచిన్నదైనను మణిపాలుని మహాసైన్యమును అది ధ్వంసంచేసి ముందుకు సాగెను. సత్యవంతుడు కూడా *'మహాశాస్తా శరణం, మహాశాస్తా శరణం'* అని ఘోషిస్తూనే రణరంగమంతయూ తిరిగి తిరిగి శత్రువులను ధ్వంసం చేయుచుండెను. ఆతని పరాక్రమముచే మణిపాలుని మహాసైన్యము నేలమట్టమయ్యెను. మణిపాలుడుకూడ సత్యవంతుని కరవాళము నకు భలియైనేలకూలెను.
ఇది జరిగి కొన్నాళ్లు అయినపిమ్మట మాళవదేశపు రాజు అనంతవర్మనుకి నిదురలో ఒక స్వప్నము కనిపించినది. ఆ స్వప్నమున జరిగిపోయిన యుద్ధంయొక్క సన్నివేశములు కనిపించెను. దక్షిణ భారత దేశ సైనికులు మాళవసైన్యము యుద్ధము చేయుటయూ , తన సైన్యాధిపతి సత్యవంతుడు యుద్ధమునకు నాయకత్యము వహించుటయూ ఆతడు రణరంగమునందుగూడ శ్రీశాస్తావారి నామమును ఉచ్చరిస్తూ శత్రువులను ధ్వంసము చేయుటయూ చూడగల్గెను. అలా అతనిచే సంహరించబడి మరణించినవారి ప్రాణములు అచ్చటయుండిన యొకదేవ విమానమున ఎక్కించుకొని దేవగణములు వెళ్ళుటయూ చూసెను. పైగా ఆతడు ఆశ్చర్యపడురీత్యా క్రూరుడైన మణిపాలుడుకూడా చివర సత్యవంతుని చేతులుమీదుగా ప్రాణము కోల్పొగా వాణిప్రాణములుగూడ ఆ విమానమునందె ఎక్కి పైకి వెళ్ళుటయూ గమనించెను. కలచెదరి నిదురలేచిన అనంతవర్మ రాజు తనకు కనిపించిన స్వప్నమునకు తాత్పర్యము అర్థంగాక తికమక పడెను.
దుర్మార్గుడు , తనదేశ ప్రజలనుగూడ కొల్లగొట్టి హింసించి బాధపెట్టుచుండు క్రూరుడైన మణిపాలునికికూడ ఎలా ఈ రణమున సద్గతి లభించుట సాధ్యమైనది ? యని తనుకు తానే పలుమార్లు ప్రశ్నించుకొనుచుండెను. ఇలా కొన్నిదినములు గడిచిన పిమ్మట అనంతవర్మరాజు యొక్క ధర్మపాలనను , అతడికి శ్రీమహాశాస్తా వారిపట్లగల అతీత భక్తిశ్రద్ధలను వినిన దేవఋషి నారద మునీంద్రుల వారు ఆతని రాజ్యమునుకు విచ్చేసిరి. మహామునిని తగురీత్యా స్వాగతముపలికి సత్కారములు చేసి సుఖాసనమున కూర్చుండబెట్టి , పాదాభివందనములు చేసి ఆ మునీశ్వరునితో తనకు కనిపించిన స్వప్నముగూర్చి తెలిపి తన అనుమానమును దీర్చవలసినదిగా వేడుకొనెను.
అందుకు నారదముని *" మహారాజా ! నీకు కనిపించిన స్వప్నమేమియు అతిశయమైనదియూకాదు. ఇందులో నీవు తికమక పడవలసినది ఏమియులేదు. నీ సైన్యాధిపతియైన సత్యవంతుడు ఆదిమూలమైనవాడు , పరమబ్రహ్మ స్వరూపియూ యగు శ్రీమహాశాస్తావారి దివ్యనామములను ఘోషిస్తూ శత్రు సైన్యములన్నిటిని హతమార్చినాడు. జీవుడు శరీరమునుండి వెలువడువేళ ఆ పరమాత్ముడైన మహాశాస్తావారి నామములను వింటూ వెలువడినందున మణిపాలుడు చేసిన సకల పాపకృత్యములు తొలగి పరిశుద్ధుడైతీరిపోయెను. తత్పుణ్యఫలమే అతన్ని అతని సైనికులందరిని శాస్తాలోకమును చేరుకొనే భాగ్యమును ప్రసాదించి యున్నది."* యని వ్యాకానించెను.
ఆమాటలు వినిన అనంతవర్మరాజు నామజపఫలము యొక్క విశిష్టతను తెలిసి ధన్యుడైయ్యను. నామజపపారయణ ప్రియుడగు శ్రీశాస్తావారి నామమునకుగల మహిమ అవర్ణానాతీతమని గ్రహించెను. అపుడు నారదమహర్షి మరలా రాజుతో *"అనంతవర్మా మిగిలిన దేవతలకు ఇష్టమైనది ఏమేమియని తెలుసుకొని మనము సమర్పిస్తుంటాము కాని శ్రీశాస్తావారుమాత్రము తనకు ఇష్టమైనది ఏమిటని తానే వర్ణించియున్నారు. అది ఏమిటంటే... కర్పూరమంటే తనకెంతో , పానకమంటే మరియెంతో , శరణన్నమంటే పదములు ఎంతెంతో ఇష్టం ఇష్టం నాకయ్య ! అని శ్రీస్వామివారే శెలవిచ్చియున్న సంగతిని తెలిసియున్నవారెల్లరూ ఆ స్వామివారి నామజపములను లెక్కకు మించి జపించి ధన్యులగుదురు"* అని దేవఋషి వివరించెను. ఆమాటలలోనే వాస్తవమును గ్రహించిన అనంతవర్ముడు తాను శ్రీశాస్తావారి నామజపోశ్చారణతో తరించుటయేగాక తనదేశ ప్రజలందరినిగూడ శ్రీ స్వామివారి నామజప సంకీర్తనము చేయించి అందరిని ధన్యులుగావించెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏