శ్రీ వేంకటేశ్వర వైభవం - 6 🌻మాధ్యాహ్నిక నివేదనము (రెండవ ఘంట)🌻

P Madhav Kumar


*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*


*🌻మాధ్యాహ్నిక నివేదనము (రెండవ ఘంట)🌻*


🍃🌹పరిచారకుడు సువర్ణ (బంగారు వాకిలి)ద్వారము ముందు నిలబడి వచనాలయములోని కైంకర్యపరులకు తెలియునట్లుగా “శ్రీవారికి ప్రసాదములు సిద్ధము కావలెను. ” అను విచిత్ర శబ్దనాదము చేయును. వెంటనే కైంకర్యపరులు వచనాలయమునుంచి శ్రీవారికి మధ్యాహ్నకాలమున జరుగు శుద్ధాన్నము, ఇతర ప్రసాదములు, విశేషప్రసాదములు, ప్రార్థనా ప్రసాదములు, ఉత్సవ ప్రసాదములను భక్తి శ్రద్ధలతో తెచ్చి శ్రీవారి దృష్టి ప్రసార స్థానము నందుంచి శ్రీవారికి నమస్కరించి కృతకృత్యులమైతిమి- అని సంతోషించుచూ వెళ్లెదరు. 


🍃🌹పిమ్మట అర్చకస్వాములు ఆలయములో ప్రవేశించి ద్వారము తలుపులు వేయుదురు. అర్చకుడు శ్రీవారికి ఇతర మూర్తులకు ఇతర దేవతలకు భోజ్యాసనమును ప్రారంభించి ప్రసాదములను క్రమముగా నివేదించి ఉత్తరాంగములగు ఉపచారములను సమర్పించు చుండును. సువర్ణద్వారమునకు దక్షిణ భాగమునయున్న మహా మంటలకు మధ్యగా కూర్చుని పరిచారకుడు రెండు ఘంటలను తలుపు మూసినది మొదలు తలుపులు తెరచువరకు శ్రీవారికి నివేదన సమయమున ప్రణవనాదముతో మ్రోగించుచుండును. 


🍃🌹పిమ్మట అర్చకుడు శ్రీవారికి ఏలాలవంగ క్రముకాదిచూర్ణయుతమైన తాంబూలమును సమర్పించి కర్పూరహారతి చేసి పుష్పాంజలిని శ్రీవారిపాదముల యందుంచి క్షమామంత్రము ననుసంధించును. అర్చకస్వాములు మామూలు ప్రకారం ఆజ్ఞా లబ్ధమైన ప్రసాదము వేరుగా తీసికొని ద్వారము తలుపులు తెరచెదరు. మహా ఘంటానాదము శమించును. కైంకర్యపరులు నివేదిత ప్రసాదములను నిర్ణీత స్థానములకు చేర్చెదరు.


🍃🌹శ్రీ భాష్యకారులవారికి నివేదనము జరుగును. శ్రీవారికి మాధ్యాహ్నికారాధనము పూర్తికాగానే శ్రీ మలయప్పస్వామివారు జగన్మాతలగు శ్రీ భూదేవులతో కూడి నరవాహనమగు తిరుచ్చి యందు వేంచేసి సకల మర్యాదలతోను, వాద్యములతోను విమాన ప్రదక్షిణముగా 'తమ రాకకై ఎదురుచూచుచు ఆనందపడుచు కనిపెట్టుకుని యున్న కల్యాణ ప్రార్థనాదిపరులగు భక్తాగ్రేసరుల యొక్క మనోరథములను తీర్చగలందులకై రంగమండపమునకు వేంచేయుదురు. అచ్చట నిరుపాధిక మాతా పితృలగు శ్రీ భూదేవులు శ్రీ మలయప్పస్వామివారు సాయంకాలము వరకు బిడ్డలగు ప్రార్ధనాపరుల యొక్క ప్రార్థనా రూపములగు కల్యాణోత్సవములను, బ్రహ్మోత్సవములను, వసంతోత్సవములను, వాహనోత్సవములను, ఆదర్శమండప దర్శనోత్సవములను (అద్దముల మహల్ ఉత్సవము) పూర్తి యొనరించి ప్రార్థనాపరులను సంతోషపెట్టు అదృష్టవంతుని అదృష్టాధీనమగు వాహనము నధిష్ఠించి తిరువీధులు వేంచేసి జనానావారితోసహా శ్రీ మలయప్పస్వామివారు శ్రీవారి సన్నిధానమున తమ స్థానములకు వేంచేయుదురు. 


🍃🌹ఇచ్చట శ్రీవారికి మాధ్యాహ్ని కారాధనము పూర్తి అయిన వెంటనే అధికారులు దర్శన ప్రియులు, దర్శనము చేసెదరు. సర్వదర్శనము ప్రారంభమగును.




     *🙏ఓం నమో వేంకటేశాయ🙏*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat