*శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 33*

P Madhav Kumar


*అధ్యాయము - 10*


*శుంభ వధ - 1*


ఋషి పలికెను : ప్రాణసమానుడైన తమ్ముడు నిశుంభుడు వధింపబడడం, సైన్యం రూపుమాప బడడం చూసి శుంభుడు క్రోధంతో ఇట్లనెను : "ఓ దుర్గా! బలగర్వంతో క్రొవ్విన నీవు ఆ గర్వాన్ని (నా వద్ద) చూపకు, ఎంత గొప్పదానవని అనుకున్నా నీవు ఇతరుల బలంపై ఆధారపడి యుద్ధం చేస్తున్నావు.


దేవి పలికెను : నేను ఈ లోకంలో ఒంటరి దాననే అయి ఉన్నాను. నేను కాక మటెవ్వరు ఉన్నారు? ఓ దుష్టుడా! నాశకులైన వీరు నాలోనికి ప్రవేశించడాన్ని చూడు.


అంతట బ్రహ్మాణి మొదలైనవారు (మాతృకలు) అందరూ దేవి శరీరంలో లీనమయ్యారు. అంబిక ఒక్కరిత మాత్రమే ఉంది.


అంతట దేవి పలికెను : నా శక్తిచే నేనిక్కడ నా నుండి వ్యక్తమైన రూపాల నన్నింటిని నేను మళ్ళీ ఉపసంహరించుకున్నాను. నేను ఒక్కదానిని మాత్రమే నిలిచివున్నాను. యుద్ధంలో స్థిరంగా ఉండు.


ఋషి పలికెను : ఆ ఇరువురికీ (దేవీశుంభులకు) ఘోర యుద్ధం ప్రారంభించారు. దేవాసురులందరూ చూస్తున్నారు.


బాణవర్షం కురిపిస్తూ, వాడి శస్త్రాలను, దారుణాస్త్రాలను ప్రయోగించుకుంటూ, వారిరువురూ మళ్ళీ సర్వలోక భయంకరంగా యద్ధం చేసారు.


అంబిక వందల కొద్దీ వేసిన దివ్యాస్త్రాలను ఆ రక్కసుల తేడు వాటికి మారుదెబ్బవైయగల అస్త్రాలతో త్రుంచివేసాడు.


అతడు ప్రయోగించిన దివ్యాస్త్రాలను భయంకరంగా హుంకరించడం మొదలైన కార్యాలచే పరమేశ్వరి అవలీలగా ఖండించింది.


అంతట ఆ రాక్షసుడు వందల కొద్దీ బాణాలతో దేవిని కప్పివేసాడు. దేవి కినుక పూని తన బాణాలతో అతని వింటిని ఛేదించింది.


సశేషం....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat