శ్రీ వేంకటేశ్వర వైభవం - 7 🌻సర్వదర్శనము🌻

P Madhav Kumar


*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*


*🌻సర్వదర్శనము🌻*


🍃🌹శ్రీవారు మధ్యాహ్నమునుంచి సాయంకాలము వరకు సర్వదర్శన మను పేరుతో సర్వమానవులకు దర్శనమిచ్చుచు భక్తిపూర్వకముగా వారు సమర్పించు కానుకలను స్వీకరించుచూ వారి కామితముల నివ్వనాలోచించుచూ శ్రమయనక వేంచేసి యుండెదరు.


🍃🌹ప్రతిదినము ఉదయమునుంచి సాయంకాలము వరకు శ్రీవారి అధి కారులు, పరిచారకులు, పరివారములు ఆస్థానమండపములో కుబేరభాగమున శ్రీవారికి పూర్వదినమునందు భక్తులు సమర్పించిన కానుకలను జాతీయముల ప్రకారముగా గణించి పెట్టెలకు పెట్టి సీళ్ళు వేయించి ఆలయములో చేర్చిదరు. దీనినే పరకామణి అని యందురు.


*🌻శుద్ధి🌻*


🍃🌹శ్రీవారి సాయంకాలారాధన సమయము కాగానే సర్వదర్శన మును ఆపివేసి స్థాన శుద్ధి జరుగును.


*🌻సాయంకాలారాధనము 🌻*


🍃🌹శ్రీవారికి సాయంకాలారాధనము చేయుటకై, విధ్యుక్తకర్మానుష్ఠాన మొనరించుకుని అర్చకుడు శ్రీవారి సాన్నిధ్యమునకు వచ్చును. ఆరాధనపూర్వాంగముగా శ్రీ జియ్యంగారు, పుష్పసంచయ స్థానమగు యమునత్తురైకి వెళ్లి అచ్చట పుష్పకైంకర్యపరులచేత, పుష్పములతోటియు, పుష్పసరములతోటియు, తులసీదళములతోటియు నిండింపబడి యున్న వేణుపాత్రమును (వెదురు గంపను) శిరస్సుయందుంచుకుని జామంటా నాదముతో శ్రీవారి సన్నిధానమునకు తెచ్చి ఉంచెదరు. 


🍃🌹అర్చకుడు పుష్పసంచయమును శుద్ధి యొనరించి మామూలు ప్రకారము శ్రీవారికి ఆరాధనము ప్రారంభించును. సాయంకాలౌపయికములగు ఉపచారము లను సమర్పించును. శ్రీ జియ్యంగార్లు, శ్రీ వైష్ణవస్వాములు మామూలు ప్రకారము దివ్య ప్రబంధము నిత్యానుసంధాన పాశురము లను ప్రారంభించెదరు. అర్చకుడు ఉపచారములు పూర్తికాగానే తోమాల సేవ ప్రారంభించును.


*🌻తోమాల సేవ🌻*


🍃🌹అర్చకుడు శ్రీస్వామివార్లకు మామూలు ప్రకారము పుష్పసర ములు సమర్పించుచుండును. శ్రీ వైష్ణవస్వాములు దివ్య ప్రబంధమును గానము చేయుదురు. మంత్రపుష్పము జరుగును. నక్షత్రహారతి అయి కర్పూరహారతి జరుగును. శ్రీవారికి తోమాలసేన పూర్తి అగును.


*🌻అష్టోత్తర శతనామార్చనము🌻*


🍃🌹అనంతరము శ్రీస్వామివారికి మామూలు ప్రకారం అష్టోత్తరశత నామార్చనము, శ్రీ భూదేవులకు లక్ష్మీనామార్చనము క్రమముగా జరుగును. అర్చనము పూర్తికాగానే మామూలు ప్రకారము జియ్యంగార్లకు, స్వాములకు, నామపాఠకునకు శఠారి జరుగును. నివేదనము ప్రారంభమునకుగాను లఘుశుద్ధి జరుగును.




      *🙏ఓం నమో వేంకటేశాయ🙏*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat