_*శ్రీ హనుమ కధామృతము 8*_

P Madhav Kumar


శ్రీ పరాశర మహ్హర్షి మైత్రేయునికి హనుమ కధ ను వివరించారు .మాఘ మాసం లో రుద్రునికిష్టమైన ఆరుద్రా నక్షత్రం లో ,ఫాల్గుణ మాసం లో పునర్వసు నక్షత్రం లో ,చైత్రం లో పుష్యమి నక్షత్రం లో ,సూర్యుడికిస్తమైన హస్తా నక్షత్రం లో శ్రీ హనుమద్ వ్రతాన్ని చేయాలి .జ్యేష్ట మాసం లో మృగశిర ,ఆరుద్ర ,పునర్వసు ,పుష్యమి ,హస్త నక్షత్రాలలో వ్రతం చేయ వచ్చు .ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి .నేలపై పడుకోవాలి .ఇంద్రియాలను అదుపులో వుంచుకోవాలి .హనుమాన్ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి .అయిదుగురు సద్బ్రాహ్మణులకు  శక్తి కొలది దానం ఇవ్వాలి .అయిదు అప్పాలు ,అయిదు పండ్లు తో వాయనం ఇవ్వాలి .అయిదుగురు బ్రహ్మచారులకు సమారాధన చేయాలి .హనుమద్ వ్రత కధలను పతించాలి .హనుమద్ సహస్రనామ ,అష్టోత్తరాలతో,సువర్చల అష్టోత్తరం తో పూజించాలి .పంపా తీరం లో వ్రతం చేస్తే ఫలితం బాగా వుంటుంది .లేక పొతే ఒక కలశం లో పంపా జలాన్ని ఆహ్వానించి ,పంపానదికి అష్టోత్తర పూజ చేయాలి .కలశం మీద పదమూడు ముళ్ళు గల తోరాలను వుంచి దాని పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మగవాళ్ళు కుడి చేతికి ,ఆడ వాళ్ళు ఎడమ చేతికి తోరం కట్టుకో వాలి . ”ఏ పుత్ర పౌత్రాది సమస్త భాగ్యం —వాన్చంతి వాయోస్తనయం ప్రపూజ్య —త్రయోదశ గ్రంధి యుతం తదంకం –బద్నంతి హస్తే వర తోర సూత్రం ” అనే మంత్రాన్ని పతిస్తూ భార్య భర్తకు ,భర్తకు భార్య తోరం కట్టాలి .ఆంజనేయుని వాహన మైన ఒంటె ను కూడా పూజించాలి

”గంధ మాదన శైలాగ్ర –స్వర్ణ రంభా వనాశ్రయం —ఉష్ట్రం ధ్యాయేత్ సదా వంద్యం —హనుమద్ వాహనోత్తమం ”అని ఉష్ట్ర ధ్యానం చేయాలి .

వ్రతం ప్రారంభం లో కలశ ప్రతిష్ట చేయాలి .అష్ట దిక్పాల పూజ చేయాలి .నవగ్రహ పూజ కూడా చేయాలి .అంతా అయిన తర్వాత ప్రసాదం నైవేద్యం పెట్టాలి అందులో అప్పాలు ,పులిహోర పరవాన్నం వుండాలి .నీరాజనం ఇవ్వాలి .తర్వాత మంత్ర పుష్పం ఇవ్వాలి .వ్రతం రోజూ ఇల్లు కాని ,ఆలయం కాని రంభా వనం తో అంతే అరటి పిలకలతో అలంకరించాలి .ఆయన్ను రంభావన విహారి అంటారు కదా అందుకు .పూజ లో తమలపాకులు ఎక్కువ వినియోగించాలి

వీటినే నాగవల్లి దళాలు అంటారు ..చివరికి భక్తీ శ్రద్ధలతో ప్రసాదం తినాలి .అంతకు ముందు తీర్ధం తీసుకోవాలి .శటారి పెట్టిన్చుకోవాలి .ఇలా శ్రీ హనుమద్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే తీరని కోరికలు తీరుతాయి .చివరికి మోక్షం లభిస్తుంది .ఇవన్నీ మన మహర్షులు చెప్పిన మాటలు .కనుక విశ్వాసం తో చేయాలి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat