అమ్మా అమ్మా రావమ్మా – కన్నుల పండుగ చేయమ్మా
తొమ్మిది రోజుల పండుగిది త్రోయగ నేత్రిరావమ్మా

1. నీ పండుగలే చేసేదమూ
నిన్నే మదిలో కొలిచెదమూ
మమ్ముల బ్రోవగ రావమ్మా
మహాలక్ష్మి దయగనవమ్మా
అమ్మా అమ్మా రావమ్మా – కన్నుల పండుగ చేయమ్మా
తొమ్మిది రోజుల పండుగిది త్రోయగ నేత్రిరావమ్మా
2. సప్తమి నాడు కాళివిగా
అష్టమి నాడు దుర్గవుగా
నవమినాడు నళినాక్షివిగా
దశమినాడు జయమం
అమ్మా అమ్మా రావమ్మా – కన్నుల పండుగ చేయమ్మా
తొమ్మిది రోజుల పండుగిది త్రోయగ నేత్రిరావమ్మా
3. రాక్షస బాధలు పడలేక
దేవలంతా మొర విడగా
మహిషాసురుని చంపితివి
మానవ కోటిని కాచితివి
అమ్మా అమ్మా రావమ్మా – కన్నుల పండుగ చేయమ్మా
తొమ్మిది రోజుల పండుగిది త్రోయగ నేత్రిరావమ్మా
4. కుంకుమ పూజలు చేసేదమూ
కువలయ నేత్రి రావమ్మా
అనసూయ దన గనవమ్మా
మంగళ హారతి గైకొనుమ్మా