అమ్మవు నీవే – అయిణిత రావే
కమ్మని వాక్కు నియ్యవే సరస్వతీ
అమ్మా మా భారతీ ఓ… ఓ… ఓ…
అమ్మవు నీవే – అయిణిత రావే
కమ్మని వాక్కు నియ్యవే సరస్వతీ
అమ్మా మా భారతీ ఓ… ఓ… ఓ…
1. కవుల గాయకులకూ – కల్పవృక్ష మంటివి
కమ్మని వాక్యాల నిచ్చే – కన్నతల్లి వంటివి
కదిలించే హృదయాల వీణా పాణి
అమ్మవు నీవే – అయిణిత రావే
కమ్మని వాక్కు నియ్యవే సరస్వతీ
అమ్మా మా భారతీ ఓ… ఓ… ఓ…
2. సకల కళా స్వరూపిణి – సత్య వాక్కు లిమ్మని
భక్తిగ నిను తలచితిని ముక్తి చూపు పావనీ
ఇలనీవె గనరావే వీణా పాణి
అమ్మవు నీవే – అయిణిత రావే
కమ్మని వాక్కు నియ్యవే సరస్వతీ
అమ్మా మా భారతీ ఓ… ఓ… ఓ…
3. స్థిరముగ మా జిహ్వలోన తిరుగాడే పావనీ
తప్పలెందు కొచ్చునికి తనయని పూజావని
యదనీవె మధువాణి వీణా పాణి
అమ్మవు నీవే – అయిణిత రావే
కమ్మని వాక్కు నియ్యవే సరస్వతీ
అమ్మా మా భారతీ ఓ… ఓ… ఓ…