ఘనుడాతడే మము గాచుగాక హరి | Annamayya Keerthanalu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

ఘనుడాతడే మము గాచుగాక హరి | Annamayya Keerthanalu

P Madhav Kumar

 ఘనుడాతడే మము గాచుగాక హరి

అనిశము నేమిక నతనికె శరణు ||

యెవ్వని నాభిని యీ బ్రహ్మాదులు
యెవ్వడు రక్షకుడిన్నిటికి |
యెవ్వని మూలము యీ సచరాచర
మవ్వల నివ్వల నతనికే శరణు ||

పురుషోత్తముడని పొగడి రెవ్వరిని
కరి నెవ్వడు గాచె |
ధర యెవ్వడెత్తి దనుజుల బొరిగొనె
అరుదుగ మేమిక నతనికె శరణు ||

శ్రీసతి యెవ్వని జేరి వురమునను
భాసిల్లె నెవ్వడు పరమంబై |
దాసుల కొరకై తగు శ్రీవేంకట
మాస చూపి నితడతనికె శరణు ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow