హరినామము కడు నానందకరము | Annamayya Keerthanalu

P Madhav Kumar

 హరినామము కడు నానందకరము

మరుగవో మరుగవో మరుగవో మనసా ||

నళినాక్షు శ్రీనామము
కలిదోషహరము కైవల్యము |
ఫలసారము బహుబంధ మోచనము
తలచవో తలచవో మనసా ||

నగధరు నామము నరకహరణము
జగదేకహితము సమ్మతము |
సగుణ నిర్గుణము సాక్షాత్కారము
పొగడవో పొగడవో పొగడవో మనసా ||

కడగి శ్రీవేంకటపతి నామము
ఒడి ఒడినే సంపత్కరము |
అడియాలం బిల నతి సుఖమూలము
తడవవో తడవవో తడవవో మనసా ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat