హరి యవతార మీతడు అన్నమయ్య |
అరయ మా గురుడీతడు అన్నమయ్య |వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు
ఆకరమై తాల్లపాక అన్నమయ్య |
ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు
ఆకడీకడ తాల్లపాక అన్నమయ్య ||
ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు
ఆవటించి తాల్లపాక అన్నమయ్య |
భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు
హావ భావమై తాల్లపాక అన్నమయ్య ||
క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు
ఆరితేరి తాల్లపాక అన్నమయ్య |
ధీరుడై సూర్యమండల తేజము వద్ద నున్నవాడు
ఆరీతుల తాల్లపాక అన్నమయ్య ||