క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని | Annamayya Keerthanalu

P Madhav Kumar

 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని

నీరజాలయమునకు నీరాజనం ||

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం |
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం ||

చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం |
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం ||

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం |
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat