రాగం: ధర్మవతి, తాళం: ఆది
మంగాంబుధి హనుమంతా నీ శరణ |
మంగవించితిమి హనుమంతా ||
బాలార్క బింబము ఫలమని ప ట్టిన
ఆలరి చేతల హనుమంతా |
తూలని బ్రహ్మాదులచే వరములు
ఓలి చేకొనినా హనుమంతా ||
జలధి దాట నీ సత్వము కపులకు
అలరి తెలిపితివి హనుమంతా |
ఇలయు నాకసము నేకముగా, నటు
బలిమి పెరిగితివి భళి హనుమంతా ||
పాతాళము లోపలి మైరావణు
ఆతల జంపిన హనుమంతా |
చేతులు మోడ్చుక శ్రీ వేంకటపతి
నీ తల గోలిచే హిత హనుమంతా ||
అలరి తెలిపితివి హనుమంతా |
ఇలయు నాకసము నేకముగా, నటు
బలిమి పెరిగితివి భళి హనుమంతా ||
పాతాళము లోపలి మైరావణు
ఆతల జంపిన హనుమంతా |
చేతులు మోడ్చుక శ్రీ వేంకటపతి
నీ తల గోలిచే హిత హనుమంతా ||