మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు |
సహజి వలె నుండి ఏమి సాధించలెడు ||వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు |
చెదరి మరచితే సృష్టి చీకటౌ |
పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు |
నిదురించితే కాలము నిమిషమై తోచు ||
వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ |
జాడతో నూరకుండితే జడుడౌను |
వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ |
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను ||
మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు |
వెరవెరగక ఉండితే వీరిడియౌను |
శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును |
పరగ సంశయించితే పాషండుడౌను ||