బల్లి పడుట - మంచి చెడులు (సూక్ష్మంగా)
1. పసిపిల్లలు, ఉపనయన, వివాహములు కాని వారిపై బల్లి పడినచో ఆశుభాశుభ ఫలితములు వారి తల్లిదండ్రులకు కలుగును.
2. బల్లి తలనుండి కాలివరకు ప్రాకినచో కష్టములు. పాదములనుండి తలవరకు పైకి ఎగబ్రాకినచో ఇష్టకామ్యసిద్ది.
3. బల్లి పాదములపై పడినచో వ్యాపారాభివృద్ధి.
4. కుడి అరికాలుమీద పడినచో ప్రయాణము ఎడమ అరికాలు మీద పడినచో ధనప్రాప్తి.
5. మడమల వెనుక భాగమున కారాగార దర్శనము.
6. పాదముల సందులయందు రోగము
7. పాదముల వెనుక భాగమున సుఖము
8. కాలివ్రేళ్ళయందు పడినచో సంతానమునకు హాని
9. కుడి పాదము వ్రేళ్ళమీద గాని గోళ్ళమధ్యగాని పడినచో సిరిసంపదలు చేకూరును.
10. గోళ్ళమీద పడినచో హాని
11. పాదములకు ఎడమవైపున క్రిందభాగంలో పడినచో నష్టము, కుడివైపున పై భాగమందు ధనలాభం, మధ్యలో హాని.
12. కుడి పిక్కయందు పడినచో లాభం.ఎడమ పిక్కయందు పడినచో నష్టము మడమలు మోకాళ్ళయందు పడినచో జయము
13. తొడకు వెనుక భాగమున-విషభయం, తొడకుముందుభాగమున- సుఖం తొడకు లోపలి భాగమందు స్త్రీ సౌఖ్యము
14. కుడితొడయందు బల్లిపడినచో - సంతాన హాని, 2. తొడలు యందు బల్లిపడినచో - సంతానలాభం. తొడల మొదట బల్లిపడినచో - నీరసము ( బలము నశించుట)
15. ఆసనమందు (ముడి) - మేలు
16. గజ్జలయందు - అనారోగ్యము
17. కుడిమోకాలునందు -కీడు
18. వృషణములపై - దాంపత్యహాని
19. కుడి పిరుదులు మీద - సౌఖ్యము, ఎడమ పిరుదులు మీద - ధనలాభం
20. శిశ్నమునందు - సంతానము, ధనధాన్యప్రాప్తి
21 లింగము మొదట - దాంపత్య సుఖము లేకపోవుట
22. మర్మావయవరోమములపై - దేశపరిత్యాగము
23. కటి ప్రదేశమున (మొల) - సంతానలాభము
24. ఉదరము నందు - ధనలాభము
25. నాభిపై - స్త్రీ సౌఖ్యం
26 కుడి భుజము - వ్యసనము
27. ఎడమ భుజము - విశేషప్రజాదరణ
28. మెడవెనుకభాగము - కీడు
29. కంఠమున - ఆప్తుల ఆగమనం
30. రొమ్ముపై - అమితానందము, సౌఖ్యము
31. ఒకేసారిరెండు పెదవులపై - మరణము
32. వీపుకు ఎడమ - జయము
33. వీపుకు కుడి - రాజభీతి
34. చేతియందు - ద్రవ్యనాశనం
35. చేతి మణికట్టు - అలంకార ప్రాప్తి
36. నడుముకు మధ్యన - ధనలాభం
37. భుజముల మీద - మరణం
38. ప్రక్కటెముకలపై మరియు నడుము కుడి భాగం - సోదర సోదరీమణులకు హాని
39. నడుముకు ఎడమప్రక్క - తల్లిదండ్రులకు పీడ
40. ఎడమ అరచేతిలో - కష్టములు
41. వ్రేళ్ళమీద బల్లి పడినచో - ఆపదలు
42. కుడి వ్రేళ్లు మధ్యన ,మరియు ఎడమ చేతి గోళ్ళు మీద - ధనలాభం
43. కుడిచేతి గోళ్ళమీద - వ్యవహార చిక్కులు
44. కుడిమోచేయి పై భాగము - శతృనాశనము
45. కుడి అరచేతియందు - లక్ష్మీప్రదము.
46. చేతిమొదట్లో - ధనధాన్యములు, యశస్సు
47. మోచేతులు - విచారము
48. మణిపూసమీద - ధనవంతుడు
49. కడుపుముడతలపై - సోదరీమణులకు కీడు
50. ఎడమ చేతిపై - స్త్రీ సుఖం
51. రొమ్ము మధ్య - పీడ
52. రొమ్ముల మీద - శుభం
53. పై పెదవి మీద - రాజ్యలాభము
54. క్రింద పెదవి - విందుభోజనము
55. నాలుకపై - విద్యాలాభము
56. గడ్డం వెంట్రుకలపై - చెరసాల ప్రాప్తి
57. గొంతుకమీద - భాగ్యము
58. గొంతు ఎముక - సంకటము
59. మీసము మీద బల్లి పడినచో -అధిక లాభం
60. మీసములకు ఎడమ ప్రక్కగా - కీడు
61. మీసమునకు కుడి ప్రక్క -జయము
62. చంకలో - భూత గ్రహపీడ
63. వెన్నుమీద - శతృబాధ, పిశాచబాధ
64. మెడయందు భాగమున - బుద్దినాశనము
65. భుజములపై - శతృనాశనము
66. ఎడమ భుజం - కీడు
67. కంఠమున ఎడమ ప్రక్క - రోగం
68. మెడకు ఎడమ ప్రక్క - వాహనప్రాప్తి
69. దంతములపై - అవమానం
70. గుండెమీద- అధైర్యము
71. కనుబొమ్మల చివర - శుభం
72. కనుబొమ్మల ఎడమభాగమున - అవమానం
73. కనుబొమ్మల మధ్య - వ్యాపారాభివృద్ధి
74. చెంపమీద - శుభం
75. పురుషులకు ఎడమ చెంప, స్త్రీలకు కుడి చెంప - హాని
76. స్త్రీలకు ఎడమ చెంప, పురుషులకు కుడి చెంప - మేలు
77. స్త్రీలకు కుడికంటిపై - కష్టము
78. స్త్రీలకు ఎడమ కంటిపై - శుభములు
79. లలాటము (నుదురు) పై - బంధుసన్మానము
80. ముక్కుపై, - ఆలస్యముగా సుఖం
81. ముక్కు చివరలయందు - కష్టములు
82. ముఖముపై - కార్యానుకూలత విజయం, ధనలాభం
83. జుట్టుముడి మీద - రోగం
84. మగవారికి కుడి కంటిపై కుడి చెవిపై - మిక్కిలి లాభము
85. స్త్రీలకు ఎడమ చెవిపై - సంపద
86. ముక్కుకు మధ్యన బల్లి పడినచో - శుభము
87. ముక్కుకు ప్రక్కన - మిత్రలాభము
88. ముక్కు కొనపై - పీడ
89. జడమీద - భర్తకు హాని
90. స్త్రీలకు నొసటి మీద - ధనలాభము
91. స్త్రీలకు శిరస్సు నందు గాని ముంగురులమీదగాని, ఆపదలు
92. స్త్రీలకు జారుముడిమీద - మేలు
93. స్త్రీలకు తలముసుగుమీద బల్లి పడినచో- మిక్కిలి కీడు
94. స్త్రీలకు చెవిదగ్గర చెంపమీద - శుభము.
95. పురుషులకు నొసటి మీద - ఉద్యోగాభివృద్ది కీర్తి, సంపద, బంధువుల ఆదరణ.
96. నడి నెత్తిమీద - రోగం
97. కుడికణతలపై -సోదరసోదరీమణులకు కీడు
98. పురుషులకు కుడిప్రక్కన - శుభం
99. తలమీద - మేనమామకు కీడు
100. తలవెంట్రుకల చివర -14 మాసములలో మరణం సంభవం
సూచన:- దేహము పై ఎక్కడ, ఎప్పుడు బల్లి పడిననూ వెంటనే స్నానము
చేసి ఇష్ట దైవప్రార్ధన చేసినచో బల్లిపాటు వలన కలుగు అశుభములు దరిచేరవని శాస్త్రవచనము.