1) ఓం శివాయ నమః = మంగళ కరుడైన శివునికి నమస్కారము .
2) ఓం మహేశ్వరాయ నమః = దేవతలతో సహా సర్వాధీశుడైన మహేశ్వరునకు నమస్కారము.
3) ఓం శంభవే నమః = శుభాన్ని, సుఖాన్ని ప్రసాదించువానికి నమస్కారము.
4) ఓం పినాకినే నమః = పినాకమనే ధనస్సును ధరించిన వానికి నమస్కారము.
5) ఓం శశి శేఖరాయ నమః = జటాజూటములో చంద్రుడిని ధరించిన వానికి నమస్కారము.
6) ఓం వామదేవాయ నమః = సౌందర్యముతో విరాజిల్లు దైవానికి నమస్కారము.
7) ఓం విరూపాక్షాయ నమః = విశేషమైన కన్నులు గలవానికి నమస్కారము.
8) ఓం కపర్దినే నమః = చక్కని జటాజూటము గలవానికి నమస్కారము.
9) ఓం నీలలోహితాయ నమః = నీలము మరియు ఎరుపు రంగులతో శోభించు వానికి నమస్కారము.
10) ఓం శంకరాయ నమః = శుభమును లేదా సుఖమును చేకూర్చు వానికి నమస్కారము
11) ఓం శూలపాణయే నమః = త్రిశూలమును చేతియందు ధరించు వానికి నమస్కారము.
12) ఓం ఖట్వాంగాయ నమః =ఖట్వాంగమను ఆయుధమును ధరించిన వానికి నమస్కారము.
13) ఓం విష్ణు వల్లభాయ నమః =విష్ణుమూర్తికి ప్రియమగు వానికి నమస్కారము.
14) ఓం శిపివిష్టాయ నమః = సూర్యకిరణములతో ప్రకాశించు వానికి నమస్కారము.
15) ఓం అంబికానాధాయ నమః = అంబికకు భర్త ఐన వానికి నమస్కారము.
16) ఓం శ్రీ కంఠాయ నమః = విషము కంఠము నందు కల వానికి నమస్కారము.
17) ఓం భక్త వత్సలాయ నమః = భక్తుల మీద వాత్సల్యం గలవానికి నమస్కారము.
18) ఓం భవాయ నమః = సర్వదా సర్వత్రా ఉండు వానికి నమస్కారము.
19) ఓం శర్వాయ నమః = సర్వ శాసన కర్తకు లేదా లయ కర్తకు నమస్కారము.
20) ఓం త్రిలోకేశాయ నమః = ముల్లోకాలకు అధిపతి ఐన వానికి నమస్కారము.
21) ఓం శితికంఠాయ నమః = తెల్లటి కంఠము గలవానికి నమస్కారము.
22)ఓం శివాప్రియాయ నమః = పార్వతీ ప్రియునకు నమస్కారము.
23) ఓం ఉగ్రాయ నమః =ఉగ్ర రూపుడైన వానికి నమస్కారము.
24) ఓం కపాలినే నమః = బ్రహ్మకపాలమును ధరించిన వానికి నమస్కారము.
25)ఓం కామారయే నమః = కామానికి శత్రువైన వానికి నమస్కారము.
26) ఓం అంధకాసురసూదనాయ నమః = అంధకాసురుని సంహరించిన వానికి నమస్కారము.
27)ఓం గంగాధరాయ నమః = గంగను ధరించిన వానికి నమస్కారము.
28) ఓం లలాటాక్షాయ నమః = నుదిటి మీద నేత్రము కల వానికి నమస్కారము.
29) ఓం కాల కాలాయ నమః = యమునికి సైతము మృత్యువు వంటి వానికి నమస్కారము.
30) ఓం కృపానిథయే నమః = దయకు గని వంటి వానికి నమస్కారము.
31) ఓం భీమాయ నమః = భీతిని గొలిపే బలవంతునికి నమస్కారము.
32)ఓం పరశుహస్తాయ నమః = గండ్ర గొడ్డలిని హస్తము నందు ధరించిన వానికి నమస్కారము.
33 ) ఓం మృగపాణయే నమః = లేడిని చేత సారించిన వానికి నమస్కారము.
34) ఓం జటాధరాయ నమః = జాడలను ధరించిన వానికి నమస్కారము.
35) ఓం కైలాసవాసినే నమః = కైలాస గిరి పై వసించువానికి నమస్కారము.
36) ఓం కవచనే నమః = దివ్య కవచమును ధరించేవానికి లేదా అనుగ్రహించే వానికి నమస్కారము.
37) ఓం కఠోరాయ నమః =కఠినంగా శాసించువాడు లేదా రుజుగామి యైన వానికి నమస్కారము.
38) ఓం త్రిపురాంతకాయ నమః = త్రిపురాలను సంహరించిన వానికి నమస్కారము.
39) ఓం వృషాఙ్కాయ నమః = ఎద్దును చిహ్నంగా గలవానికి నమస్కారము.
40) ఓం వృషభారూడాయ నమః = వృషభం వాహనం గా కలవానికి నమస్కారము.
41) ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః = శరీరమంతటా భస్మమును పూసుకున్న వానికి నమస్కారము.
42) ఓం సామప్రియాయ నమః = సామవేదమంటే ప్రీతి కలవానికి నమస్కారము.
43)ఓం స్వరమయాయ నమః.= శబ్దమయుడైన వానికి నమస్కారము.
44) ఓం త్రయీమూర్తయే నమః = త్రిమూర్తుల రూపాలను ధరించిన వానికి , మూడు వేదముల స్వరూపుడైన వానికి నమస్కారము.
45) ఓం అనీశ్వరాయ నమః = తనకు ప్రభువు లేని వానికి నమస్కారము.
46) ఓం సర్వజ్ఞాయ నమః = సమస్తమూ తెలిసిన వానికి నమస్కారము.
47) ఓం పరమాత్మనే నమః = పరమాత్మకు నమస్కారము.
48)ఓం సోమసూర్యాగ్నినేత్రాయ నమః = చంద్రుని , సూర్యుని మరియు అగ్నిని నేత్రములుగా గలవానికి నమస్కారము.
49) ఓం హవిషే నమః = క్రతువులో హోమార్పిత ద్రవ్య రూపుడికి లేదా హవిర్భాగమును గ్రహించేవానికి నమస్కారము.
50) ఓం యజ్ఞమయాయ నమః = యజ్ఞమే తన స్వరూపమైన వానికి నమస్కారము.
51) ఓం సోమాయ నమః = ఉమాదేవితో సదా కూడి ఉండే వానికి నమస్కారము.
52) ఓం పంచవక్త్రాయ నమః = ఐదు ముఖములు కలిగిన శివునకు నమస్కారము.
53) ఓం సదాశివాయ నమః = యెల్ల వేళలా మంగళ ప్రదాత అయినవానికి నమస్కారము.
54) ఓం విశ్వేశ్వరాయ నమః = విశ్వానికంతటికీ ప్రభువైన వానికి నమస్కారము.
55) ఓం వీరభద్రాయ నమః = వీరభద్రుని అవతారమును ధరించిన వానికి నమస్కారము.
56)ఓం గణనాథాయ నమః = దేవ గణములకు ప్రభువైన వానికి నమస్కారము.
57)ఓం ప్రజాపతయే నమః = ప్రజలకు ప్రభువైన వానికి నమస్కారము.
58)ఓం హిరణ్యరేతసే నమః = బంగారపు వీర్యము గలవానికి నమస్కారము.
59)ఓం దుర్ధర్షాయ నమః = ఎదిరించడానికి వీలు లేనివానికి నమస్కారము.
60) ఓం గిరీశాయ నమః = కైలాసపతికి నమస్కారము.
61)ఓం గిరిశాయ నమః = పర్వతము శయనించు వానికి నమస్కారము.
62) ఓం అనఘాయ నమః. = పాప రహితునకు నమస్కారము.
63) ఓం భుజంగ భూషణాయ నమః = పాములు ఆభరణములు గా గలిగిన వానికి నమస్కారము.
64) ఓం భర్గాయ నమః = ప్రకాశరూపుడైన వానికి నమస్కారము.
65) ఓం గిరిధన్వనే నమః =పర్వతమును ధనస్సుగా ధరించిన వానికి నమస్కారము.
66) ఓం గిరిప్రియాయ నమః = కొండలపై ప్రీతి కలవానికి నమస్కారము.
67) ఓం కృత్తివాససే నమః = ఏనుగు చర్మమును వస్త్రముగా కప్పుకున్న వానికి నమస్కారము.
68) ఓం పురారాతయే నమః = త్రిపురాసురలకు శత్రువైన వానికి నమస్కారము.
69) ఓం భగవతే నమః = షడ్గుణ సంపన్నుడైన వానికి నమస్కారము.
70) ఓం ప్రమథాధిపాయ నమః = ప్రమథ గణము లన్నింటికీ నాయకుడైన వానికి నమస్కారము.
71) ఓం మృత్యుంజయాయ నమః = మృత్యువును జయించిన వానికి నమస్కారము.
72) ఓం సూక్ష్మ తనవే నమః = బహు సూక్ష్మ మైన వానికి నమస్కారము.
73) ఓం జగద్వ్యాపినే నమః = విశ్వమంతటా వ్యాపించిన వానికి నమస్కారము.
74) ఓం జగద్గురువే నమః = జగద్గురువునకు నమస్కారము.
75) ఓం వ్యోమకేశాయ నమః = ఆకాశమే తల నీలాలుగా కలిగిన లేదా ముంగురులుగా భాసించిన వానికి నమస్కారము.
76) ఓం మహాసేనజనకాయ నమః = మహాసేనా నాయకుడైన కుమార స్వామికి తండ్రి అయినవానికి నమస్కారము.
77) ఓం చారువిక్రమాయ నమః = మంచి పరాక్రమవంతుడైన వానికి నమస్కారము.
78) ఓం రుద్రాయ నమః = సమస్త దుఃఖాలను దహింపచేసేవానికి నమస్కారము.
79) ఓం భూతపతయే నమః = సమస్త ప్రాణులకు , పంచ మహాభూతములకు ప్రభువు అయిన వానికి నమస్కారము.
80) ఓం స్థాణవే నమః = స్థిరునికి లేదా చలనం లేని వానికి లేదా తాను కదలటానికి చోటు లేనంతగా అంతటా నిండి నిబిడీకృతుడైన వాడు
81) ఓం అహిర్భుధ్న్యాయ నమః = దివారాత్రాలకు లేదా మేఘానికి లేదా సర్పానికి కారణభూతుడైన వానికి నమస్కారము.
82) ఓం దిగంబరాయ నమః = దిక్కులే వస్త్రముగా గలవానికి నమస్కారము.
83) ఓం అష్టమూర్తయే నమః = ఎనిమిది రూపాలున్నవానికి నమస్కారము.
84) ఓం అనేకాత్మనే నమః = అందరిలో ఆత్మగా శోభిల్లు వానికి నమస్కారము.
85) ఓం సాత్వికాయ నమః = సత్వగుణ ప్రధానుడైన వానికి నమస్కారము.
86) ఓం శుద్ధవిగ్రహాయ నమః = పరిశుద్ధమైన రూపముతో లేదా శారీ రాముతో భాసించు వానికి నమస్కారము.
87)ఓం శాశ్వతాయ నమః= శాశ్వతుడైన వానికి నమస్కారము.
88)ఓం ఖండపరశువే నమః = శత్రువులను ఖండించే గండ్ర గొడ్డలిని కలిగిన వానికి నమస్కారము.
89) ఓం అజాయ నమః పుట్టుక లేని వానికి నమస్కారము.
90) ఓం పాశవిమోచనాయ నమః = జీవులందరినీ ప్రపంచ పాశము నుండి విడిపించేవానికి నమస్కారము.
91) ఓం మృడాయ నమః = నిత్యమూ సుఖిస్తూ . సజ్జనులకు సుఖమును ప్రసాదించువానికి నమస్కారము.
92)ఓం పశుపతయే నమః = సమస్త జీవులకూ ప్రభువైన వానికి నమస్కారము.
93)ఓం దేవాయ నమః = ప్రకాశైక రూపునకు నమస్కారము.
94) ఓం మహాదేవాయ నమః = మహోత్క్రుష్టుడైన వానికి నమస్కారము.
95) ఓం అవ్యయాయ నమః = వ్యయము లేనివానికి నమస్కారము.
96) ఓం హరయే నమః = పాపములను హరించేవానికి నమస్కారము.
97) ఓం భగనేత్రభిదే నమః = భగుడనే సూర్యుని కళ్ళను తొలగించినవాడు.
98) ఓం అవ్యక్తాయ నమః = వ్యక్తము కానివానికి నమస్కారము.
99) ఓం దక్షాధ్వరహరాయ నమః = దక్ష యజ్ఞమును ధ్వంసం చేసినవానికి నమస్కారము.
100) ఓం హరాయ నమః = హరునకు నమస్కారము.
101) ఓం పూషదంతబిదే నమః = పూషుడనే సూర్యుని దంతములను పోగొట్టినవానికి నమస్కారము.
102) ఓం అవ్యగ్రాయ నమః = తనకంటే ఉత్క్రుష్టమైనది లేనివానికి లేదా ఎటువంటి తాపమును పొందని వానికి నమస్కారము.
103) ఓం సహాస్రాక్షాయ నమః = వేయి కన్నులు గలవానికి నమస్కారము.
104) ఓం సహస్రపాదే నమః = వేయి పాదములు కలవానికి నమస్కారము.
105) ఓం అపవర్గప్రదాయ నమః = మోక్షమును ప్రాదించు వానికి నమస్కారము.
106)ఓం అనంతాయ నమః = అంతము లేని వానికి నమస్కారము.
107) ఓం తారకాయ నమః = సంసార సాగరము నుండి తరింప చేయువానికి నమస్కారము.
108) ఓం పరమేశ్వరాయ నమః = పరమేశ్వరునకు నమస్కారము.
ప్రతీ రోజూ ప్రదోష కాలములో శివాష్టోత్తర శత నామాలను చదవటం లేదా వినటం లేదా స్మరణ , సర్వ శుభములనూ చేకూరుస్తుంది .