🌻. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? 🌻
ఒక శుభదినాన అచ్చమ్మగారిని ఈశ్వర క్షేత్రమైన యాగంటి’కి తీసుకుని వెళ్లారు వీరబ్రహ్మేంద్రస్వామి. అక్కడ జ్ఞానోపదేశం మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ సామాన్యులకు అర్ధమయ్యే విధంగా సరళమైన భాషలో జవాబులిచ్చారు వీరబ్రహ్మేంద్రస్వామి.
వాటిలో కొన్ని...
పరమాత్మ ప్రపంచంలో అణువణువునా ఉన్నాడు. ఈ పశువులలో, నీలో, నాలో, కీటకాలలో.. అన్నిటిలోనూ ఆయన నివాసం ఉంటుంది.
🌻. దేవుని తెలుసుకోవడం ఎలా? 🌻
దేవుని తెలుసుకోడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ భక్తి, ధ్యానం శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే కేవలం భగవంతుని ధ్యానిస్తూ జీవితాన్ని గడపడమే.
దీన్నే భక్తి యోగం అని కూడా అంటారు. ధ్యాన యోగం అంటే ప్రాణాయామం ద్వారా ఈ సృష్టిని ప్రారంభించిన బ్రహ్మ ను తెలుసుకోవడమే.
🌻. దేవుని ఏ రూపంలో మనం చూడగలం? స్త్రీయా, పురుషుడా? 🌻
పరబ్రహ్మ నిరాకారుడు, నిర్గుణుడు. మనం ఏ విధంగానూ నిర్వచించలేము.
ఈ విధంగా అచ్చమ్మగారి సందేహాలను తీర్చిన తర్వాత ఆమెకు కొన్ని మంత్రాలను ఉపదేశించారు వీరబ్రహ్మేంద్రస్వామి. వీటిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండమని చెప్పారు.
తర్వాత కాలజ్ఞానం గురించి వివరించడం మొదలుపెట్టారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹