రావి ఆకులపై ప్రమిదను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే?

P Madhav Kumar


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿రావిచెట్టు విశేషాలతో కూడుకున్నది.

శాపాలు, దోషాలు, పూర్వ జన్మ కర్మలను ఈ రావిచెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావిచెట్టును పూజించడమే.


🌸అంతేగాకుండా ఇంట్లో రావిచెట్టు ఆకులను వుంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప,దోష,కర్మ ఫలితాలు వుండవు.

పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి.


🌿రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి..

దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.


🌸శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు,

రాహు-కేతుదోషాలు,

నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.

అలాగే సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపం వెలిగించాలి.


🌿మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు, 

బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు,

 గురువారం జన్మించిన జాతకులు ఐదు దీపాలు, 

శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు,

శనివారం జన్మించిన జాతకులు 9 దీపాలు,

ఆదివారం జన్మించిన జాతకులు 12 రావి ఆకులపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి.


🌸రావిచెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు వుండేలా,

ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి.

దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి. 


🌿ఇలా చేస్తే దోషాలు తొలగి, శుభ ఫలితాలను ఆశించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.


🌸ఇంకా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజించడం..

ఆమె అనుగ్రహం పొందాలంటే..

తమలపాకుపై ప్రమిదలను వుంచి దీపం వెలిగించడం శుభప్రదం.


🌿ఇంకా తమలపాకుపై ప్రమిదను వుంచి నేతితో దీపమెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 


🌸హర హర మహాదేవ శంభో శంకర

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః

శివ సంకల్పమస్తుః..స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat