సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో
సీతా కళ్యాణమే - ఇలలో వైభోగమే
తరములు నిలిచిన, జగములు మురిసిన రామ కళ్యాణం
||సీతారామ॥
1. పెళ్ళియంటే సీతారామ కళ్యాణమే
మళ్ళి మళ్ళి చూడలేని వైభోగమే
ఇంతకన్న గొప్ప పెళ్ళి జరగలేదనీ అంతకన్నా గొప్పజంట చూడలేదనీ
తరతరాలు చెప్పుకున్నా- ఇది తరగని వైభోగాం
||సీతారామ॥
2. భూదేవి మారెనంట పెళ్ళి పీఠగా
ఆకాశమంత పచ్చ పందిరాయెగా
దేవ దుందుభి మ్రోగెనంట దిక్కు దిక్కునా
పూలవాన కురిసెనంట జల్లు జల్లునా
పెళ్ళి పందిళ్ళ సందడిలో తల్లి సీతమ్మ సిగ్గులలో.....
||సీతారామ॥
3. రతనాల అక్షింతలు మెరిసెనంటా
ముత్యాల తలంబ్రాలు కురిసెనంటా
కళ్యాణ రామయ్య సిరినవ్వులే
సీతమ్మ సిగ్గులే రంగవల్లులై
మరు మల్లెల పందిట్లో సిరి వెన్నెల లోగిట్లో
॥సీతారామ॥
ఆనంద మానంద మాయనే - తల్లి సీతమ్మ పెళ్ళికూతురాయనే
ఆనంద మానంద మాయనే తండ్రి రామయ్య పెండ్లికొడుకాయనే ఆనంద మానంద మాయనే ॥2॥