వివిధ దీప ప్రమిదలు - ఫలితాలు*

P Madhav Kumar


*(ఋషిపీఠ వ్యాసం నుండి).….!*!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🍃🌹బంగారు ప్రమిదః గోధుమలపై ఉంచి చుట్టూ ఎరుపు రంగు పూలు అలంకరించి, ఆవు నెయ్యితో తూర్పు ముఖంగా వెలిగించాలి. ధనసమృద్ధి, విశష బుద్ధి చాతుర్యం లభిస్తుంది.


🌸🍃🌹వెండి ప్రమిదః బియ్యంపై ఉంచి తెలుపు రంగు పూలతో అలంకరించి, ఆవునెయ్యితో తూర్పు ముఖంగా వెలిగిస్తే ధనసంపద వృద్ధి చెందుతుంది.


🍃🌹రాగి ప్రమిదః ఎర్రని కందిపప్పుపై ఉంచి ఎరుపు రంగు పూలతో అలంకరించి, నువ్వుల నూనెతో దక్షిణాభిముఖంగా వెలిగిస్తే మనోబలం కలుగుతుంది, అనిష్టనాశనం.


🌸🍃🌹కంచు ప్రమిదః దీనిని శనగపప్పుపై పెట్టి చుట్టూ పసుపురంగు పూలతో అలంకరించి, ఉత్తరాభిముఖంగా నువ్వుల నూనెతో వెలిగిస్తే ధనానిని స్థిరత్వం ఉంటుంది.


🍃🌹మట్టిప్రమిదః ఆవు నెయ్యితో తులసి మొక్క వద్ద వెలిగించాలి. దుష్టశక్తుల నాశనం, పాపహరణం.


🌸🍃🌹పిండి ప్రమిదః పిండితో నలుచదరపు దీపం వెలిగిస్తే నాలుగువిధాలా లాభం కలుగుతుంది.


🍃🌹అమావాస్య రాత్రి ఆవు నేతితో రావిచెట్టు కింద దీపం పెడితే పితృదేవతలు సంతోషిస్తారు.


🌸🍃🌹ఆవనూనెతో రావిచెట్టు క్రింద నలభై ఒక్క రోజులు దీపం వెలిగిస్తే కోరిక కోరిక నెరవేరుతుంది.


🍃🌹నువ్వుల నూనెతో నలభై ఒక్కరోజులు దీపం వెలిగిస్తే సమస్త రోగాలు తొలగుతాయి.


🌸🍃🌹గురువారం నాడు అరటిచెట్టు దగ్గర ఆవునేతితో దీపం వెలిగిస్తే అవివాహితులకు శీఘ్రమే వివాహ ప్రాప్తి కలుగుతుంది..

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat