కరుణానిధి నీవే కనుఁగొంచునున్నాఁడవు - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన

P Madhav Kumar

 

అధ్యాత్మ సంకీర్తన.       2717. 31-10-23.

రేకు: 238-6.               సంపుటము: 3-221

రాగము: భైరవి.           గానం: అభయ్.


కరుణానిధి నీవే కనుఁగొంచునున్నాఁడవు

యిరవై నాలో నున్నాఁడ వేది గతి యిఁకను

॥పల్లవి॥


పేరుచున్నవి నాలోనఁ బెక్కు వికారములు

వూరుచున్నవెన్నైనా వూహలెల్లాను

చేరుచున్నవొక్కొక్కటే సేనాసేనకోరికలు

యీరీతి నున్నాఁడ నాకు నేది గతి యిఁకను

॥కరు॥


పట్టుచున్నవి నానాప్రకృతుల వోజలు

పుట్టుచున్నవి యనేకభోగేచ్ఛలు

చుట్టుకొనుచున్నవి సులభపు వేడుకలు

యిట్టివి నానడతలు యేది గతి యిఁకను

॥కరు॥


సందడింపుచున్నవి సారెకు నా మమతలు

ముందువెనకై వున్నవి మోహాలెల్లా

చెందె నీపై భక్తి నేఁడు శ్రీవేంకటేశ్వర

యెందునూ నీవే కాక యేది గతి యిఁకను

॥కరు॥        

                 *సేకరణ : సూర్య ప్రకాష్ నిష్టల* 

꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅•••••••••♾️꧂

                ‌ ‌

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat