నిజ మాడఁబోతేను నీకు నీకే భ్రమసేవు - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన

P Madhav Kumar


శృంగార సంకీర్తన.        గానం : యోగ కీర్తన.

రేకు: 1013-5.              సంపుటము: 20-77

రాగము: మాళవిగౌళ.    2716. 30-10-23


నిజ మాడఁబోతేను నీకు నీకే భ్రమసేవు

భజన మెరసితిఁగా పంతమాడి నేను

॥పల్లవి॥


పలుకులో నొకటి భావములో నొకటి

కలికి నీగుణమెల్లాఁ గంటిఁగా నేను

తెలిసి చింతించేవు దినము లెంచుకొనేవు

యెలమి నీవూహలెల్ల నెఱిఁగితి నేను

॥నిజ॥


నగవులో నొకటి నడవడిలో నొకటి

వెగటైన నీకతలు వింటిఁగా నేను

పొగరుల నలసేపు పొదుదిక్కే చూచేవు

అగడైతి విందరిలో నంటిఁగా నేను

॥నిజ॥


కాఁగిటిలో నొకటి కాఁకలలో నొఁకటి

కీఁగంటఁజూచి యెఱిఁగితిఁగా నేను

దాఁగక శ్రీవేంకటేశ తగఁ గూడితివి నీవు

ఆఁగి నీసిగ్గు వాపితి నవుఁగా నేను

॥నిజ॥

                 *సేకరణ : సూర్య ప్రకాష్ నిష్టల* 

꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅•••••••••♾️꧂

                ‌ ‌

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat