చెప్పఁబోతే యీ యర్థము చిత్తము - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన

P Madhav Kumar

 ꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅••••••••♾️꧂

             🙏 *ఓం నమో 

అధ్యాత్మ సంకీర్తన.    2722. 5-11-23

రేకు: 346-3

సంపుటము: 4-270

రాగము: శంకరాభరణం


చెప్పఁబోతే యీ యర్థము చిత్తము వొడఁబడదు

తప్పులు వెదకకురో తత్వజ్ఞులాల

॥పల్లవి॥


చెలఁగి మిథ్య యంటాఁ జేసేయజ్ఞాలు ఫలించునా

యిల శూన్యోపాసకుల కేడ దేవుఁడు

లలి మాయా శబళితులకు మోక్ష మెక్కడిది

నలి నభేదవాది కానందానుభవ మేది

॥చెప్పఁ॥


హరి శరణుచొరనియట్టివారికి దిక్కేది

గురుఁడు వేరే లేఁడట కోరి వుపదేశమేది

వెరసి శిఖాసూత్రాలు విడిచితే ప్రణవమేది

పరగ భక్తి లేదట భవమేట్టు గడచె

॥చెప్పఁ॥


శ్రీవేంకటేశుముద్ర ధరించక వైకుంఠమేది

యీ విభుపేరు జపించకెట్టు పాపా లుత్తరించు

వేవేగ దాసుఁడుగాక వెట్టికేల కరుణించు

సేవించినఁగాక సర్వచింతలేల యుడుగు

॥చెప్పఁ॥       

                 *సేకరణ : సూర్య ప్రకాష్ నిష్టల* 

꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅•••••••••♾️꧂

                ‌ ‌

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat