Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

నమో నమో దానవవినాశ చక్రమా...అన్నమాచార్య కీర్తనలు

 * -9651*


** 


🙏🏻🌷🙏🏻


*తాళ్ళపాక అ

*గానం. శ్రీ గరిమెళ్ళ బాలకృ

నమో నమో దానవవినాశ చక్రమా

సమరవిజయమైన సర్వేశు చక్రమా ॥పల్లవి॥

 

అట్టే పదారుభుజాల నమరిన చక్రమా

పట్టినాయుధముల బలుచక్రమా

నెట్టన మూఁడుగన్నుల నిలిచిన చక్రమా

ఱట్టుగా మన్నించవే మెఱయుచు చక్రమా ॥నమో॥

   

ఆరయ నారుగోణాల నమరిన చక్రమా

ధారలు వేయిటితోడి తగు చక్రమా

ఆరక మీఁదికి వెళ్లే అగ్నిశిఖల చక్రమా

గారవాన నీ దాసులఁ గావవే చక్రమా ॥నమో॥

   

రవిచంద్రకోటితేజరాసియైన చక్రమా

దివిజసేవితమైన దివ్య చక్రమా

తవిలి శ్రీవేంకటేశు దక్షిణకర చక్రమా

యివల నీదాసులము యేలుకోవే చక్రమా ॥నమో॥

📢 Follow