సమసె రావణుఁడు సమరములోపల - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన

P Madhav Kumar


అధ్యాత్మ సంకీర్తన.        2718.   1-11-23

రేకు: 390-4.                సంపుటము: 4-523

రాగము: సామంతం.    గానం:వినయ్, సుదీప్, కార్తికేయ


సమసె రావణుఁడు సమరములోపల

అమరులు కడు ముదమందిరి మెరసి

॥పల్లవి॥


బెరగిరి రాముని శరముల కసురలు

సురిగిరి పోట్లచురుకునను

తొరిగిరి నెత్తుటఁ దునియలు సేసిన

తిరిగిరి తరుమఁగ దిక్కులకు

॥మసె॥


కూలిరి భల్లూకుల ఘోషములకు

వాలిరి వాయుజవాలహతి

వీలిరి యంగదు వివిధనాదముల

తూలిరి సుగ్రీవు దోర్భలమునను

॥మసె॥


దాఁగిరి లక్ష్మణు దాకకు నులుకుచు

వీఁగిరి వనచర వితతికిని

పాఁగి శ్రీ వేంకటపతి కృపా రసమునఁ

దోఁగిరి జనులు సంతోసంబునను

॥మసె॥       

                 *సేకరణ : సూర్య ప్రకాష్ నిష్టల* 

꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅•••••••••♾️꧂

                ‌ ‌

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat