శ్రీశైల శివ లింగాన్ని మాత్రమే చేతితో ఎందుకు తాకుతారు?

P Madhav Kumar

*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<

*ప్ర:  శ్రీశైలం మేము వెళ్ళినప్పుడు, అక్కడ అందరూ శివలింగాన్ని తాకి నమస్కరిస్తున్నారు. మిగిలిన క్షేత్రాలలో అలా జరగడం లేదు. ఉత్తరాదిలో కూడా అలాగే చేస్తారు. ఉజ్జయినీ, కాశీ వంటివాటిలో. కానీ మనవైపు, మిగిలిన దేవాలయాలలో ఇలా అందరూ తాకరుఎందుచేత?* 

 

 *జ :* శివాలయాలుగానీ, ఏ ఆలయాలుగానీ ఆ బింబమందు (లింగం/విగ్రహం) యంత్ర, మంత్ర శక్తులతోదైవీకళలను ఆవహింపజేస్తారు. వాటి పవిత్రతను శౌచాదులతో కాపాడుకోవాలి.

అప్పుడే,ప్రతిష్ఠించిన 'దేవతాశక్తి' చెక్కుచెదరకుండా ఉంటుంది. పైగా - అనేక మంది అనేక రకాల భావనా ప్రకంపనలతో ఉంటారు. వారంతా

బింబాన్ని తాకితే, అందులోప్రతిష్ఠితశక్తి తరుగుతుంది. అందులోనూ - కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తూ, శాశ్వతంగా ఉండవలసిన శిల్పాలను కూడా తాకరాదనీ, దానివల్ల ఆ శిల్పం క్షయమౌతుందనీ 'పురాతత్త్వ శాస్త్రవేత్తలు' హెచ్చరికలు కూడా చెప్తున్నారు కదా! శిల్ప రక్షణ దృష్ట్యా కూడా అది సమర్థనీయం. అయితే శ్రీశైలం, ఉజ్జయినీ, కాశీ - ఇవన్నీ జ్యోతిర్లింగాలు. వాటిని తాకినా, అందులోని దైవశక్తి సన్నగిల్లదని,శాస్త్రాలు చెప్తున్నాయి. స్వయంభూలింగాలై, ప్రత్యేకించి 'జ్యోతిః' స్వరూపంగా ఉన్నవాటికి ఉన్న ఆ మహాశక్తిపై ఎటువంటి భావనా ప్రకంపనలైనా దెబ్బతిననీయవు. శివపురాణాదులు కూడా ఈ విషయం చెప్తున్నాయి. ఆ కారణంచేతఎవరైనా జ్యోతిర్లింగాలను తాకి,అర్చించవచ్చు. అన్నిచోట్లా అలా పనికిరాదు. అయితే 'వాయుప్రతిష్ఠావిధానం' తో చేసిన ప్రతిష్ఠలలో శివలింగాన్ని స్పర్శించవచ్చు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat