స్వామి ఏమాన్నాడోయ్ అయ్యప్పా స్వామి ఏమన్నాడోయ్
1. నలభై రోజులు దీక్షబూని రమ్మన్నాడోయ్
మంచిరోజు చూసి ముడుపు కట్టమన్నాడోయ్
|||స్వామి||
2. శాంతంగా అణిగి మణిగి ఉండమన్నాడోయ్
సన్యాసి రూపంలో రమ్మన్నాడోయ్
||స్వామి||
3. కొండలన్ని ఎక్కి ఎక్కి రమ్మన్నాడోయ్
కోపమిడిచి శాంతంగా ఉండమన్నాడోయ్
||స్వామి||
4. పంపలోన స్నానం చేసి రమ్మన్నాడోయ్
పాపాలన్ని పోతాయని చెప్పమన్నాడోయ్
||స్వామి||
5. పద్దెనిమిది మెట్లెక్కి రమ్మన్నాడోయ్
కన్నెమూల గణపతిని చూడమన్నాడోయ్
||స్వామి||
6. నెయ్యాభిషేకమే చెయ్యమన్నాడోయ్
ఇక జన్మలేదు ముక్కినే పొందమన్నాడోయ్
||స్వామి||