తోడుగ నిలిచే మణికంఠ మా దైవం నీవే మణికంఠ -
భక్తవరదుడా - జ్ఞానరూపుడా - సుందరాంగుడా - సర్వవ్యాప్తుడా
కరుణాలొలుకు నీ కనులకాంతిలో జన్మము తరియించే తోడుగ
1. పులిపాలు తెచ్చేవు ఓ బాలుడా
స్వామి పులి వాహనుడవు ఓ వీరుడా
శరణన్న క్షణమందు పలికేవయా
స్వామి శబరిగిరికి జ్యోతివి నీవై వెలిగేవయా
శబరివాసుడా శరణమియ్యరా హరుని పుత్రుడా మమ్ముకావరా -
భక్తిమీర నిను కొలుచుకుంటిమి - కరుణను కురిపించూ
||తోడుగ॥
2. సర్వేశ్వరుడునూ నీవేనయా
స్వామి సుఖశాంతులన్నీ ఇచ్చేవయా
ఇహలోక బంధాలు విడలేమయా
నిన్ను నిరతము కొలిచే భాగ్యాన్ని మాకియ్యవా
భక్తవరదుడా - జ్ఞానరూపుడా - సుందరాంగుడా - సర్వవ్యాప్తుడా
కరుణలొలుకు నీ కనులకాంతిలో జన్మము తరియించే
||తోడుగ॥