మన దేవతల సంఖ్య?

P Madhav Kumar


*ప్ర: మూడుకోట్లు, ముప్ఫైమూడు కోట్లు - అని మన దేవతల సంఖ్య చెబు తుంటారు. ఇందులో మూడు, ముప్ఫైమూడు కూడా తెలియవు. మరి 'కోట్ల' సంఖ్య ఎలా తెలుస్తుంది?*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


జ: 'కోటి' అంటే 'సమూహము' అని అర్థం. ప్రధాన దేవతలు ముగ్గురు. వీరు దేవతలకే శాసకులు. బ్రహ్మ,, విష్ణు, రుద్రులు - ముగ్గురు దేవదేవులు. వీరి పార్షద గణాలే కోట్లు (అత్యధిక సంఖ్య - అని అర్థం ). ఈ గణాలను, ఆ ముగ్గురు దేవతలను కలిపి 'మూడుకోట్లు ' అన్నారు. ఇక విశ్వ నిర్వాహణకై ఈశ్వర శక్తి తన విభూతులతో దేవతా వ్యవస్థను ఏర్పరిచింది.

ద్వాదశాదిత్యులు (12 ), ఏకాదశ రుద్రులు (11 ), అష్టవసవులు (😎, ఇంద్రుడు (1), ప్రజాపతి(1)... కలిపి 33, వీరి గణముల అసంఖ్యాకం.

కనుక 'కోట్లు'.

"అష్టా వసవః ఏకాదశరుద్రాః ద్వాదశాదిత్యాః

తే ఏకత్రిగ్ం శత్ (31), ఇంద్రశ్చైవ ప్రజాప్రతిశ్చైవ త్రయస్త్రిగ్ం శత్" అని శతపథ బ్రాహ్మణము.

ఈ వేదవచన ప్రకారం పై ముప్ఫైయి ముగ్గురినీ చెప్పడం జరిగింది. అయితే కొన్నిచోట్ల ఇంద్ర, ప్రజాపతుల బదులుగా, అశ్వనీ దేవతలు (ఇద్దరు) చెప్పబడ్డారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat