శబరిమల అయ్యప్ప మాలలో కన్నెస్వామి విశిష్టత

P Madhav Kumar

 కన్నెస్వామి విశిష్టత:


శ్రీ అయ్యప్ప స్వామి దీక్షను మొట్ట మొదటి సారి

స్వీకరించిన వారినే కన్నె అయ్యప్ప స్వామిగా పిలువబడుతారు.

అయితే మొదటిసారి మాలధారణ చేసేవారు చాలా జాగ్రత్త

వహించి మీకు తెలిసిన మంచి సీనియర్ స్వామి ద్వారా

గురుస్వామిని, సంఘమును (సమాజము) ఎంచుకోవాల్సిన

అవసరము ఎంతో ఉంది. మొదటి సారి వెళ్లే స్వాములు శ్రీ

అయ్యప్ప స్వామి అనుగ్రహ బ్రహ్మచర్యవ్రత దీక్షలో ఎన్నో

విధివిధానాలు ఉన్నాయి. ఇటువంటి విషయాలపైన సంపూర్ణ

అవగాహనతో మాల ధారణతో దీక్ష స్వీకరించినట్లైతే దీక్ష

సఫలమౌతుంది.


కన్నె స్వామికి, అయ్యప్పకు, లోక కళ్యాణానికి, మాలికా పురత్తమ్మకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటనగా


శ్రీ మణికంఠుని అవతారములో మహిషి అనే రాక్షషి వలన భూవాసులు మరియు దేవతలు ఎన్నో బాధలను ఎదుర్కొంటుండగా దేవతలకు మహిషికి యుద్ధములో దేవతలు ఓటమి పాలౌతున్న తరుణములో దేవతలందరు శ్రీ మణికంఠస్వామి వారిని స్తుతించి, శరణాగతులై ప్రార్థించారు.


మహిషి బాధ నుండి రక్షిస్తానని ఆ అయ్యప్ప స్వామి దేవతలకు అభయమిచ్చారు.


అలసా (అలుదా) నదీ తీరములో మణికంఠ స్వామికి మహిషికి ఘోర యుద్ధము జరిగి ఆ యుద్ధములో మహిషి సంహారం జరిగిన తరువాత మహిషికి శాప విముక్తి కలిగినదై ఆ మణికంఠ స్వామిని ప్రార్థించి తనను వివాహమాడాలని కోరెను. ఆమె కోరినట్లే లీలావతిగా ప్రత్యక్షమయ్యెను కాని ఆ అయ్యప్ప స్వామి వారు తన తల్లి యగు పాండ్యరాణికి తాను బ్రహ్మచారిగా యుంటానని చేసిన వాగ్దానము వలన లీలావతి నుంచి వివాహమును తప్పించుకొనుటకు శబరిగిరి కి ఏ సంవత్సరమైతే ఒక్క కన్నె స్వామి అయినా రాడో ఆ సంవత్సరము నిన్ను వివాహమాడతానని వాగ్దానము చేసి మాలిగా పురత్తమ్మ దేవిగా ఇక్కడ కొలువుండమని తన యొక్క ఎడమవైపు స్థానం ఇచ్చారు. అదియే శ్రీ మాలిగా పురత్తమ్మ దేవాలయం.


నేటికీ శబరిమలలో మకర సంక్రాంతి దినాన జ్యోతి దర్శనం తరువాత రోజున అమ్మవారు ఏనుగు అంబారి పై “శరణుకుత్తియల్” కి వెళ్లి కన్నె స్వామి వదిలిన శరము గురించి


వెతికి అక్కడ ఉన్నటువంటి లక్షల శరములను అమ్మ చూసి, ఆ ఏనుగు సహితము కన్నీరు పర్యంత మౌతుందని గురు స్వాములు ఎందరో అనుభవ పూర్వకముగా తెలియజేసారు. అదే ఏనుగుపై అమ్మవారు తిరిగి తన కోవెలకు వెళ్తుంది. ఈ విధంగా స్వామి వారు ప్రపంచానికి జ్యోతిస్వరూపునిగా కాంతమలై పై ప్రత్యక్షమౌతారు. ఇలా తన భక్త కోటిని శ్రీ ధర్మశాస్తాగా బ్రహ్మచారియై యోగ పట్టము వేసుకొని చిన్ముద్ర ధారియై ప్రపంచాన్ని కలిమాయ నుండి కాపాడుతున్నారు.


నేడు ప్రతీ యొక్క (సీనియర్) పెరియస్వామి ఆలోచించాలి. మన వంతు బాధ్యతగా కన్నెస్వామి యొక్క విశిష్టతను గ్రహించి ఇతరులకు తెలియజేసి శబరియాత్రలో ముఖ్యమైన స్వామి ఆ కన్నె స్వామిని సాక్షాత్తు అయ్యప్ప స్వామిగా మనం పిల్చుకుంటాం, ఆ కన్నె స్వామికి సరైన మార్గ దర్శనము చేయాల్సిన బాధ్యత ప్రతీ యొక్క మాల ధరించిన స్వాముల పై ఉంది. ఇలా సేవ చేయడం ద్వారా మనము ఆ అయ్యప్ప స్వామి కృపా కటాక్షములు పొందుతాము. ఆ కన్నె స్వామిపై ఆ అయ్య వారి శక్తి లోక కళ్యాణార్థము, ఆ అమ్మవారి శక్తి తన కళ్యాణార్థము పనిచేస్తూ ఈ మాయ విలాసంలో ఇద్దరు లోక కళ్యాణార్థము ఆ కన్నె స్వామిని భాగస్తున్ని చేసారు అనే దానిలో సందేహం లేదు, అంటే నేటి లక్షల స్వాములు తమ ముక్తి సాధనతో పాటు లోక కళ్యాణార్థము ఒక రోజు కన్నె స్వామిగా శబరియాత్ర చేసారు చేస్తున్నారు.


ఈ కలిమాయలో పడి మనకు తెలియకుండానే, తెలిసి కూడా మొండి ధైర్యముతో దీక్షలోని కఠిన నియమ నిష్టలకు వ్యతిరేకముగా మనము చేస్తూ ఇతరులను కూడా అదే మార్గంలో తీసుకెళ్లి ఆ మహిషిలా మనము కూడా ఆ భగవంతుని చిత్తానికి వ్యతిరేకముగా వెళ్తున్నాము అనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. కన్నె స్వామిని సీనియర్ స్వాములు భజనలలో (అన్నదానముల) భిక్ష సమయంలో కన్నె స్వామికి ఎక్కువగా వడ్డించి ఇబ్బందికి గురి చేస్తుంటారు. ఇది తప్పు ఏక భుక్తం దీక్షలో మిత ఆహారము మన లక్ష్యము. ఈ విషయాన్ని మరవరాదు.


కన్నె స్వామి ప్రియనే శరణమయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat