ఈశ్వర దండకం..!!

P Madhav Kumar



శ్రీ కంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి ! మురారి! ప్రియ చంద్రధారీ ! మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్య స్వరూపా ! 


విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా! దేవ నీదైన తత్వంబు! భావించి బుద్ధిం బ్రధానంబు కర్మంబు! విజ్ఞాన ఆధ్యాత్మ యెసాగంబు ! 


సర్వ క్రియా కారణంబంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతుల్ ! విచారించుచో నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా ! సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా! 


నిర్వికల్ప ప్రభావా ! భవానీ పతీ! నీవు లోక త్రయీ వర్తనంబుల్ మహీవాయు ఖాత్వగ్ని సోమార్క తోయంబులంజేసి కావించి సంసారచక్ర క్రియా యంత్ర వాహుండవై ఆది దేవా! 


మహాదేవ నిత్యంబు నత్యంత యెసొగస్థితి న్నిర్మల జ్ఞాన దీప ప్రభా జాల ! విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ ! జితక్రోధరోగాది దోషుల్ ! యతీంద్రుల్ ! యతాత్ముల్ ! 


భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులైరి అవ్యయా!భవ్య సేవ్యా ! భవా భర్గ భట్టారకా ! భార్గవాగస్థ్య కుత్సాది నానా ముని స్తోత్ర దత్తవధానా ! 


లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ ! భస్మానులిప్తాంగ! గంగాధరా ! నీ ప్రసాదంబునన్ ! సర్వ గీర్వాణ గంధర్వులున్ ! సిద్ధసాధ్యోరగేంద్రా మరేంద్రాదులున్ ! 


శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా !! సురాభ్యర్చితా !!! నాకున్ అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ !! త్రిలోకైకనాథా ! మహా దేవ దేవా !! నమస్తే నమస్తే నమస్తే నమః !!


*సేకరణ : సకల దేవత సమాచారం గ్రూపు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat