పరిస్థితుల కారణం చేత మనం వండిన భోజనం పెట్టలేక పోయినప్పుడు , సాధారణం గా బ్రాహ్మణులు బయటి భోజనం తినరు.
వారు చేసే అనుష్టానం వల్ల వారు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చెయ్యరు
(అనుష్ఠానం అంటే ఆచారం, నడవడి, వివిధ ధర్మ కర్మలు)
అందుకోసం వారిని ఇబ్బంది కలిగించకుండా బ్రాహ్మణుడి నే స్వయంగా తయారు చేసుకోమని ప్రార్ధిస్తూ ఇచ్చేదే స్వయంపాకం.
స్వయంపాకం కు కావలసినవి....
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
(దోసకాయ, బీరకాయ,
పచ్చిఅరటికాయలు,దొండకాయలు,
చామగడ్డలు , కంద గడ్డ ,
ఆకుకూరల్లో తోటకూర )
ఇందులో మీకిష్టమైనవి కనీసం 4 రకాల కూరలు ఉండాలి.వాటితో పాటు బియ్యం , చింతపండు, పప్పులు, బెల్లం,గట్టి ఉప్పు, ఎండు మిరపకాయలు, నెయ్యి, పెరుగు .....ఇలా భోజనానికి సరిపడా అన్ని పదార్ధాలు ఒక ఆకులో పెట్టి ఇవ్వాలి .
కూరగాయలతో పాటు తోటకూర తప్పనిసరిగా వుండాలి అని చెప్తారు మనపెద్దలు.
ఇవే కాకుండా దానం చేసుకోవడానికి ఏ వస్తువూ అనర్హం కాదు .
విస్తరి లో బియ్యం కనీసం
1-1/4 కేజీ ఉండాలి
తీపి గుమ్మడి కూడఇవ్వొచ్చు.
మధ్య లో రెండు తమలపాకులు, వక్కలు నల్లవి , రెండు అరటిపండ్లు , తాంబూలం మీకు తోచిన దక్షిణ (51/- లేదా 116/- ) ఉంచివారికిఅందించాలి..
దానితో వారు కూడా ఎంతో సంతసించి మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని ఆశీర్వచనం పలకుతారు ( దీవిస్తారు).
సౌఖ్యమైన జీవనం కోసం మంచి గుమ్మడి పండు దానం చేసుకోవచ్చు
అన్ని కలగా పులగంగా కలిపేసి ఇవ్వకుండా వేటికీ అవి ప్రత్యేకం గా ఒక కవరులాంటి దాంట్లో వేసి ఇస్తే
వస్తువులు పాడుకాకుండా ఇంటికి తీసుకువెళ్లి వండుకుంటారు....
విస్తరి లో అన్ని ఉంచిన తరువాత బియ్యం పిండితో చేసిన దీపాన్ని ఉంచి ప్రత్యేకం గా కార్తీక మాసం లో
దీప దానం కూడా చెయ్యొచ్చు. దానికి విశేష ఫలితం పొందుతారు.
🌸🫐🌸🫐🌸🫐🌸🫐