పరిపూర్ణం గణపతితత్త్వం

P Madhav Kumar


గణపతిని 'జ్యేష్ఠరాజు' అని వేదం కీర్తించింది. గొప్పవారిని జ్యేష్ఠులు అంటారు. అలాంటి మహ నీయుల్లో అత్యంత శ్రేష్ఠుడు జ్యేష్ఠరాజు. దేవతలు జ్యేష్ఠులు. వారిని శాసించే పరతత్వం ఇతడు.


గణపతి, బ్రహ్మణస్పతి, జ్యేష్ఠరాజు- ఈ మూడు పేర్లు యజ్ఞేశ్వరుడైన భగవానుని కీర్తిస్తూ వేదమంత్రాలు విను తించాయి. బ్రహ్మణాలు అంటే యజ్ఞకర్మలు, ఉత్తమ క్రియలు... అనే అర్థాల్లో శాస్త్రం చెబుతోంది. అలాంటి సత్కర్మలకీ, సత్పురుషులకీ, సదాలోచనలకీ ప్రభువైన పరమేశ్వరుని గణేశ్వరునిగా ఆరాధించే సంప్రదాయమే గణేశపూజ.


ఆగమాలలో గణపతిని ఓంకారరూపునిగా అభివర్ణిం చారు. వేదమంత్రాలు గణాలైతే, వాటికి మూలమైన ఓంకారమే గణపతి. సనాతన ధర్మంలో సర్వదేవతా. శక్తులకు మూలం ఓంకారం.


ఈ దేవతాశక్తులు నిర్వహించే లోకరక్షణకార్యాలే సత్కర్మలు. ఆ శక్తులకీ, వారి కార్యాలకీ నియామకుడైన గణేశునే- యజ్ఞకర్మల్లో ప్రథమంగా ఆరాధిస్తారు.


విఘ్నం అంటే అవరోధం. సృష్టిలో ప్రతిదీ ఒక పరిమి తికి లోబడి ఉంటుంది. దేశ, కాల, వస్తు పరిమితులతో ఉన్న ఈ ప్రపంచగతి విఘ్నం. దాన్ని నియమించేవాడు. దేశకాలాది పరిమితులకు అతీతుడైన పరమాత్మ. ఆ అపరిమిత తత్త్వాన్నే విఘ్నేశ్వరునిగా అన్వయించవచ్చు.


జగతిని నియంత్రించి నడిపించి తీర్చిదిద్దే శిక్షణను 'వినయం' అంటారు. అలా నియమించే దైవాన్ని 'వినా యకుడు' అని పేర్కొన్నారు. ఇలా గణపతి నామాలన్నీ సర్వజగన్నియామకమైన పరతత్వాన్నే తేటపరుస్తున్నాయి.


అందుకే వేదపరమైన ఉపాసనా సంప్రదాయం గాణ పత్యం ప్రధాన స్థానం సంపాదించుకుంది. తత్త్వపరంగా- గణపతి నామాలకు ఎన్ని పరమార్గాలు : న్నాయో, ఆయన రూపంలో, పూజావిధానాల్లోనూ అనేక అద్భుత సంకేతాలు ఉన్నాయి.


గణపతి శరీరం నరాకారం. ముఖం గజవదనం. కింది భాగమైన నరాకారం త్రిగుణాత్మక (సత్వరజస్తమో గుణాలతో కూడిన) ప్రకృతి (మాయ)కి సంకేతం. గజాకారం పురుష (పూర్ణ) తత్త్వానికి ప్రతీక. ప్రకృతికి చైతన్యం పురుషుడే. పురుషునికి ఉపాధి ప్రకృతి. ఈ రెండింటి ఏకత్వమే ఈ విశ్వ చలనం. కంఠానికి పైభాగం (ఏనుగు ముఖం) చిన్మయం, కింది భాగం జగన్మయం అని గణపతి వాఙ్మయం విశదపరుస్తోంది. చిన్మయమైన ఈశ్వర తత్త్వం గజవదనం. మాయామయమైన ప్రకృతి నరాకారం. అందుకే పైభాగం 'గజం' కింది భాగం 'జగం'. గ= గమ్యమైనది; జ = కారణమైనది.


*దేనినుంచి విశ్వం 'జ'నించిందో అదే 'జ' (కారణతత్త్వం).* చివరికి దేనిలో లీనమవుతుందో, యోగులకు ఏ అవ్యక్తపరతత్వం 'గ'మ్యమో, ముక్తులు దేనియందు 'గ'మిస్తారో (లయమవుతారో) అది - 'గ'. ఆ 'గ' నుంచే 'జ' నించింది విశ్వం. తిరిగి అందులోనికే 'గ'మిస్తోంది.


*ఇదే 'గజ-జగ' సమన్వయం, అవ్యక్త- సమైక్యతత్త్వం.*


ఈ ఈశ్వరతత్త్వమే ప్రపంచానికి పుష్టినిచ్చే ప్రధాన తత్త్వం. ప్రధానమైన బలాన్ని 'ఏక దంతం' అంటారని పురాణం నిర్వచిస్తోంది 'ఏక శబ్దం ప్రాధా న్యాన్నీ, 'దంత' శబ్దం బలాన్నీ సూచిస్తోంది. విశ్వానికి ముఖ్యబలం ఈశ్వర శక్తి. అటువంటి బలస్వరూపుడు కనుకనే గణపతి నిండైన, బలుపైన మహాకాయునిగా గోచరిస్తున్నాడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat