రుద్రాక్షలు - వాటి విశిష్టతలు....!!

P Madhav Kumar


1) *ఏకముఖి రుద్రాక్ష* :

ఇది శివుని ప్రతిరూపం. ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి.


2) *ద్విముఖి* :

అర్ధనారీస్వర తత్వానికి సంకేతం. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.


3) *త్రిముఖి* :

ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.


4) *చతుర్ముఖి* :

బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి. విద్యార్ధులకు బాగా ఉపకరిస్తుంది.


5) *పంచముఖి* :

గుండె జబ్బులున్నవారికి మంచిది. శతృవులను సులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.


6) *షణ్ముఖి* :

కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.


7) *సప్తముఖి* : కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదు.


8.*అష్టముఖి* : విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.


9) *నవముఖి* :

భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.


10) *దశముఖి* : జనార్ధనుడికి పరీక్ష. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.


11) *ఏకాదశముఖి* :

11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తులనుంచి కాపాడుతుంది.


12) *ద్వాదశముఖి* :

12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది.


13) *త్రయోదశముఖి* : కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది.


14) *చతుర్దశముఖి* :

14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను.


15) *పంచదశముఖి* : పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.


16) *షోడశముఖి* :

16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.


17) *సప్తదశముఖి* : విశ్వకర్మకు ప్రతీక. దీని వలన సంపద కలుగుతుంది.


18) *అష్టాదశముఖి* :

18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.


19) *ఏకోన్నవింశతిముఖి* : 19 ముఖాలు. ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం.


20) *వింశతిముఖి* : 20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat