మణికంఠ నీ నామమే వెన్నెల శబరిమల నీ స్థానమే వెన్నెల
చరణం :మళయాళ దేశమంట వెన్నెలో వెన్నెల
పందళ రాజుడంట - వెన్నెలో వెన్నెల
హరిహర తనయుడంట - వెన్నెలో వెన్నెల
అందాల బాలుడంట - వెన్నెలో వెన్నెల
ఏడేడు లోకాలు వెన్నెల, నీవు పాలించగ వచ్చినాడు వెన్నెలో వెన్నెల ॥మణికంఠ॥
2 శ్రీధర్మ శాస్తుడంట - వెన్నెలో వెన్నెల
శబరిగిరి వాసుడంట - వెన్నెలో వెన్నెల
విళ్లాలి వీరుడంట - వెన్నెలో వెన్నెల
వీరమణి కంఠుడంట - వెన్నెలో వెన్నెల
పులిపాలు తెచ్చినాడు వెన్నెల తల్లిబాధ తీర్చినాడు వెన్నెలో వెన్నెల ॥మణికంఠ॥
3. ముగ్గురన్నదమ్ములంట - వెన్నెలో వెన్నెల
వీరాధివీరులంట - వెన్నెలో వెన్నెల
రాజాధిరాజులంట - వెన్నెలో వెన్నెల
రావెన్నెలో వెన్నెల - మణికంఠ నీ నామమే వెన్నెల శబరిమల నీ స్థానమే వెన్నెలజ కుమారులంట - వెన్నెలో వెన్నెల
జ్యోతిస్వరూపుడంట వెన్నెల- స్వామి వైభోగం చూడాలి వెన్నెలో వెన్నెల ॥మణికంఠ॥
4. నీ మాల వేసినాము - వెన్నెలో వెన్నెల
నీ దీక్ష బూనినాము - వెన్నెలో వెన్నెల
ఇరుముడులే కట్టినాము - వెన్నెలో వెన్నెల
శబరిగిరికి చేరినాము - వెన్నెలో వెన్నెల
మకరసంక్రాంతినాడు వెన్నెల-జ్యోతినే చూశాము వెన్నెలో వెన్నెల ॥మణికంఠ॥