శివ శివమూర్తివి గణనాథ నువు శివునీ కుమారుడవు గణనాధా ॥2॥
1. అమ్మచేతి నలుగు పిండి- గణనాధా, నువ్వు అందంగ రూపుదిద్దె - గణనాధా
అయ్య శివుని కడ్డుజెప్పి గణనాధా, నువ్వు ఎదురు లేని స్వామివైతి - గణనాధా
2. తల్లితండ్రి చుట్టుతిరిగి- గణనాధా, నువు గణములకు రాజువైతి గణనాధా
తొలి పూజ సేతునీకు- గణనాధాచ తొల్లి వరమీయవయ్య మాకు - గణనాధా
3. అడవిలోన పత్రితెచ్చి గణనాధా, నీ పూజ సేతుమయ్య గణనాధా
కుడుములు, ఉండ్రాళ్ళు గణనాధా, నీకు ఆరగింపు సేతమయ్య - గణనాధా
4. చందమామ నవ్వెనని - గణనాధా, (మరి) అమ్మేమో శాపమిచ్చె - గణనాధా
చవితినాడు నిన్ను కొలిచి- గణనాధా, మేము చంద్రుడ్ని చూడమయ్య - గణనాధా