*సోమవతి అమావాస్య రోజు ఏం చేయాలి.? ఏ పూజ చేయాలి.? ఎలా చేయాలి.? అనేది తెలుసుకుందాం*
*అమావాస్య ! సోమవారంతో కలసి వచ్చినది!! బహుపుణ్య మహోదయకాలం!!*
*ఈశ్వరార్చన బహుపుణ్యప్రదం!*
🙏సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును *"సోమావతి అమావాస్య"* అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.🙏
*🙏సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి🙏*
🙏1. సోమావతీ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం.🙏
🙏2. ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి.🙏
🙏3. శని మంత్రాన్ని పఠించి, శ్రీ మన్నారాయణ మూర్తిని అర్చించాలి.🙏
🙏4. గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది.🙏
🙏5. వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం - సోమావతీ అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించినవారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. 🙏
🙏సోమవతి అమావాస్య రోజు ఏం చేయాలి ?🙏
🙏శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే ... అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు.. ఇక సోమవారము అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి_అమావాస్య..’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు.
🙏సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు ... ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు.. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం ... 🙏
🙏ఈ పూజ పంచారామాలలో కానీ, రాహు కాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట ... ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు ...🙏
🙏సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో వుండే సకల దోషాలు తొలగి పోతాయని విశ్వాసం ... సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి ... రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి ... సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.🙏
🙏ఈ అమావాస్య స్త్రీలకు ప్రత్యేకం. ఈనాడు ఉపవాసము చేసిన స్త్రీ కి సంతాన భాగ్యము తో పాటు, ఆమె జీవితంలో ఆమెకు వైధవ్యం ప్రాప్తించదట అందుకే దీనిని సోమవతి అమావాస్య అంటారు.🙏
🙏అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజు సోమావతి అమావాస్య . ఈ రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి.🙏
🙏ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ మన్నారాయణుని, పార్వతీ పరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, మౌనం పాటించాలి. 🙏
🕉శుభమస్తు 🕉
సర్వే జనా సుఖినోభవంతు 🙏👍