మన వేదాలలో - శాంతి - శాంతి - శాంతి: - అనగా అర్థం ఏమిటి?

P Madhav Kumar


మన వేదాలలో తెలుపబడిన ఏ మంత్రంలోనైనా 

శాంతి మంత్రాలన్నీ కూడా చివర్లో 

ఓం శాంతి ... శాంతి ... శాంతిః అని ముగుస్తాయి


దాని అర్థం ఏమిటి??? - దాని వలన లాభం ఏమిటి??? - ఒకసారి పరిశీలిద్దాం...


ఏదో ఒక సందర్భంలో ... వేద పండితులు ... ఈ శాంతి మంత్రాల్ని పఠించడం మనందరం వినే ఉంటాం ...


శాంతి మంత్రంలో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఎందుకు ఉచ్చరిస్తారో  తెలియదు, కానీ అది విన్నప్పుడల్లా మనం కూడా ఉచ్చరిస్తాము, కానీ ఎందుకో తెలియదు...


*మనుషులకు మూడు రకాల ఉపద్రవాలనుండీ ప్రమాదం ముంచుకొస్తుంది*


1 ఆధ్యాత్మిక ...

2 ఆదీ దైవిక ... 

3 ఆది భౌతిక...


*ఇక వీటి వివరాలు పరిశీలిద్దాము...*


మొదటి " శాంతి " పదం .....


ప్రకృతి పరంగా సంభవించే ( భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు మొదలగునవి ) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు / ముప్పు కలగకుండా ఉండటానికి . దీన్ని " ఆధ్యాత్మిక " అంటారు,


రెండవ " శాంతి " పదం .....


మనం మన చుట్టూ ఉన్నవారు, పరిసరాలు, అంతా బావుండాలని, శారీరిక , మానసికపరంగా సంభవించే ఉపద్రవం ( అనారోగ్యం ) నుంచీ ఉపశమనం పొందడానికి, అందరికీ దేవుని అనుగ్రహ, ఆశీస్సులు ఉండాలని, ప్రార్థించేదే... దీన్ని  " ఆదీదైవిక " అంటారు,


మూడవ " శాంతి " పదం .....


ఇతర జీవరాశులనుండీ , మనుష్యులు నుండీ ఏవిధమైన ఆపదలు / ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండటానికి, దీన్ని " ఆధిభౌతికము " అంటారు,


ఈ మూడు ఉపద్రవాలనుండీ రక్షించమని వేడుకుంటూ  చివర్లో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు...


సర్వే జనా సుఖినో భవంతు ....

ఓం శాంతి - శాంతి - శాంతి:..


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat