చంద్రశేఖరీ నీనామం ఎంతో వీనుల విందు పరవశ మొందు
పరమ పావనీ పాప విమోచని పార్వతీ
మా మనవిని వినుమా మము దయగను మా శంకరీ
చంద్రశేఖరీ నీనామం ఎంతో వీనుల విందు పరవశ మొందు
పరమ పావనీ పాప విమోచని పార్వతీ
మా మనవిని వినుమా మము దయగను మా శంకరీ
1. జనులకు తల్లివి నీవేగా – జగన్మోహిని నీవే మా తల్లివి
నీనామమే మోక్షపు మార్గము
మా హృదయము నందున నిలుపుము
చంద్రశేఖరీ నీనామం ఎంతో వీనుల విందు పరవశ మొందు
పరమ పావనీ పాప విమోచని పార్వతీ
మా మనవిని వినుమా మము దయగను మా శంకరీ
2. మధుర మధుర మగు నామము
మా హృదయము నందున నిలుపుము
నీల కంఠుని ప్రియసత పార్వతీ
వేగ్ర వాహన మూర్తివి శంకరీ
చంద్రశేఖరీ నీనామం ఎంతో వీనుల విందు పరవశ మొందు
పరమ పావనీ పాప విమోచని పార్వతీ
మా మనవిని వినుమా మము దయగను మా శంకరీ
3. మల్లె గులాబి పూలతో – నీ పాద పూజకై నిలచి తిమి
ఈ దీనుల మొరలాలింపుము
దరి చేర్చడి మార్గము చూపుము
చంద్రశేఖరీ నీనామం ఎంతో వీనుల విందు పరవశ మొందు
పరమ పావనీ పాప విమోచని పార్వతీ
మా మనవిని వినుమా మము దయగను మా శంకరీ