ఏ తీరుగ నను దయ చూచెదవో ఇనువంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళనదళేక్షణ రామా
ఏ తీరుగ నను దయ చూచెదవో ఇనువంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళనదళేక్షణ రామా
శ్రీరఘునందన సీతారమా శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిన్ను కన్నది కానువు రామా
ఏ తీరుగ నను దయ చూచెదవో ఇనువంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళనదళేక్షణ రామా
మురిపెముతో నాస్వామివి నీవని ముందుగ దెల్పితి రామా
మరువక ఇక నభి మానమందు నీ మరుగు జోచ్చితి రామా
ఏ తీరుగ నను దయ చూచెదవో ఇనువంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళనదళేక్షణ రామా
కూరకర్మములు నేరక చేసితి నేరము లెంచకు రామా
దారిద్రము పరిహారము సేయ వే దైవ శిఖామణి రామా
ఏ తీరుగ నను దయ చూచెదవో ఇనువంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళనదళేక్షణ రామా
గురుడవు నామదిదైవము నీవనియు నిశాస్త్రంబులు రామా
గురుదైవ౦బని మెరుగు తిరిగెడు క్రూరుడై నైతిని రామా
ఏ తీరుగ నను దయ చూచెదవో ఇనువంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళనదళేక్షణ రామా
తాండవమున నఖిలాండ కోటి బ్రహ్మండ నాయికా రామా
బందనమున నీనామము దలచిన బ్రహ్మనందము రామా
ఏ తీరుగ నను దయ చూచెదవో ఇనువంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళనదళేక్షణ రామా
వాసవ కమల భావామర వందిత వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన భాద్రాద్రీశ్వర రామా
వాసవినుత రామదాసపోషణ వందన యోధ్య రామా
దాసార్చిత మాకభయ మొసంగవె దాశరథి రఘు రామా
ఏ తీరుగ నను దయ చూచెదవో ఇనువంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళనదళేక్షణ రామా