జయ గణనాయక వినాయకా
వినుతిని వినుమా శుభదాయకా
జయ పార్వతి తనయా జయ విఘ్నరాజా
జయ గణనాయక వినాయక వినుతిని
వినుము శుభదాయకా
1. మూషిక వాహన – ముల్లోక పూజితా
విఘ్నాలు తొలగించు విజయ ప్రదాతా
ఆర్తజనరక్షక – భక్త జనపాల
దీనబాంధవ కరుణ పాలించు మమ్మేలు
జయ గణనాయక వినాయకా
వినుతిని వినుమా శుభదాయకా
జయ పార్వతి తనయా జయ విఘ్నరాజా
జయ గణనాయక వినాయక వినుతిని
వినుము శుభదాయకా
2. ఏపూజ చేసినా – ఏసేవలు చేసినా
ఏ నోములు నోసినా – ఏమని వేడినా
విజయము నొసగె విష్నురాజువని
ముందుగ నిన్నే పూజింతు మయ్యా
జయ గణనాయక వినాయకా
వినుతిని వినుమా శుభదాయకా
జయ పార్వతి తనయా జయ విఘ్నరాజా
జయ గణనాయక వినాయక వినుతిని
వినుము శుభదాయకా
3. గణములు నాయకా – నీమహిమెరుగక
త్రిముఖుడు నీతో పందెము కట్టగ
సర్వధర్మములు తృటిలో నిలపి
త్రిముఖని గెలిచిన బుద్ది శాలివి
జయ గణనాయక వినాయకా
వినుతిని వినుమా శుభదాయకా
జయ పార్వతి తనయా జయ విఘ్నరాజా
జయ గణనాయక వినాయక వినుతిని
వినుము శుభదాయకా