కార్తీక మాసాన్ని కౌముది మాసం అని ఎందుకంటారో తెలుసా..? కౌముది అంటే ఏమిటి..కార్తీకంలో కౌముది విశిష్టత ఏంటి..
Karthika Masam : కార్తీక మాసం అంటే ఓ పక్క చలి..మరోపక్క ఆధ్మాత్మిక భావన కలిగించే అద్భుతమైన మాసం. బ్రహ్మముహూర్తంలో స్నానాలు..దీపాల వెలుగులు..మానసిక ప్రశాంతత..ఇలా ఎన్నో ఎన్నెన్నో భావనల కలయిక. కార్మీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. శివకేశలకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసం అంతా ఆధ్మాత్మిక మేళమింపుగా జరుగుతుంది. ప్రతీరోజు ఓ ప్రత్యేకతే. ప్రతీరోజు పూజలు, వ్రతాలతో మహిళలు కొత్త రూపును సంతరించుకుని ఆధ్మాత్మిక భావనతో కలిగి ఉంటారు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం కృత్తిక నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది కార్తీక మాసంగా పిలవబడుతుంది. మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసంలో చంద్రుడు చాలా శక్తిమంతంగా ఉంటాడు. అందుకే కార్తీకమాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్ర కిరణాలు నీటిమీద పడి నీరు చల్లదనంతో ఉంటుంది. చంద్రకిరణాలు నీటిమీద పడటంతో చెరువులు, కాలువలు, నదుల నీరు ఔషధల కలబోతగా మారుతుంది. చంద్రకిరణాలు రాత్రంతా పడిన ఈ నీటిలో వేకువజామునే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
కౌముది అంటే వెన్నెల అని అర్థం. వెన్నెల కాంతి పడిన నీటితో స్నానాలు కార్తీకమాసం ప్రత్యేకత..చంద్రుని ప్రకాశం..వెన్నెల చల్లదనం అంతా కాలువలు, చెరువులు, నదుల నీటిమీద పడి ఈ నీరు ఔషధంగా మారుతుంది. ఈ నీటిలో స్నానం చేస్తే మనస్సు..శరీరం ఉత్తేజంగా మారుతుంది.
కాగా.. మనం రోజు చేసేదే అయినా స్నానాల్లో చాలా రకాలున్నాయని చాలామందికి తెలియదు..రుషి స్నానం, దేవ స్నానం, మానవ స్నానం, రాక్షస స్నానం,వారుణ స్నానం ఇలా స్నానాలకు చాలా చాలా రకాల పేర్లున్నాయి. అలాగే ఈ కార్తీక మాసంలో వేకువ జామునే చేసే ‘వెన్నెల స్నానం’ అంటే వెన్నెల పడిన నీటితో స్నానం చేయటం మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనదే చెప్పాలి. వెన్నెల్లో స్వచ్ఛమైన నీటిలో స్నానం చేస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుందని చేస్తేనే తెలుస్తుంది..ఆ అనుభూతిని మనస్సు, శరీరం ఆస్వాదిస్తేనే అర్థమవుతుంది.