భక్తి పేరుతో కార్తీక మాసం నెలరోజులూ బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయటం అనేది మన పూర్వీకులు ఎందుకు సృష్టించారు..? కార్తీక మాసంలో స్నానాల వల్ల కలిగే ప్రయోజాలేంటీ..? దీంటో ఉంటే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ..?
Karthika Masam snamam : హిందు పండుగల్లో ఆరోగ్య ప్రయోజనాల మేళవింపులు కలిగి ఉంటాయి. దేవుడికి పెట్టే నైవేద్యం నుంచి ఆచరించే అన్ని ప్రక్రియలు ఆరోగ్యాలకు కలిగించే సంప్రదాయాలే. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే పురాతన కాలం నుంచి కార్తీక ఆధ్యాత్మికం, దేవుడు, భక్తి పేరుతో కార్తీక మాసం నెలరోజులూ బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయటం అనేది సృష్టించారు మన పూర్వీకులు. అదే మన పూర్వీకుల గొప్పదనం. ఈ నెలరోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే శరీరం కొత్త ఉత్తేజితంగా మారుతుంది. స్నానం అనేది శరీర శుభ్రత కోసం చేస్తాం. కానీ చేసే స్నానంలో సమయం..సందర్భం కూడా ముఖ్యమేనంటారు పెద్దలు. స్నానం అనేది శుభత్ర కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కోపాడుకోవడంలో భాగం. కానీ..మనం ప్రతీరోజు చేసే స్నానం వేరు..కార్తీకమాసంలో చేసే స్నానం వేరంటారు అని చెబుతారు మన పెద్దలు.
కార్తీకమాసంలో వేకువ జామునే స్నానాలు చేయటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం..కార్తీకమాసం శీతాకాలంలో వస్తుంది కాబట్టి చలి వణికిస్తుంటుంది. శరీరం అంతా ఓ రకమైన నిస్తేజానికి గురవుతుంది. చలికి ముసుగు పెట్టి పడుకోవాలనిపిస్తుంది. కానీ కాస్త బద్దకాన్ని వదిలించుకుని వేకువజామునే స్నానం చేస్తే చలిపులి వదిలిపోవటమే కాదు..శరీరంలోకి ఓ సరికొత్త ఉత్తేజం వస్తుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారంగా చూస్తే కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యుడి కిరణాల్లో వేడి తగ్గుతుంది. దీంతో ప్రతీ మనిషి శరీరంలో వేడి తక్కువగా ఉంటుంది. అది మనిషి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. శరీరంలో తగిన ఉష్ణశక్తి లేకపోతే జీర్ణశక్తి తగ్గుతుంది. చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటం వల్ల ఇంకా నొప్పులు పెరుగుతాయి.
వీటన్నింటి నుంచి ఉపశమనమే కార్తీకస్నానం. ఆరోగ్య రక్షణ కోసమే నెల రోజు అంటే చలి ఉదృతి పెరిగే ఈ కార్తీక మాసం రోజుల్లో వేకువ జామునే స్నానం చేయాలని నియమం పెట్టారు పెద్దలు. తొందరగా నిద్రలేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి ఉపశమనం కలిగించుకోవచ్చు. పడుకున్నంత సేపు ఏదోక అనీజీగానే ఉంటుంది. లేచి స్నానం చేస్తే ఉత్తేజం కలుగుతుంది. పైగా వేకువ జామునే లేవటం వల్ల రోజువారీ చేసుకునే అన్ని పనులు త్వరగా పూర్తి అయిపోతాయి.బోల్డంత సమయం మిగులుతుంది.
అదే సమీపంలో ఉండే ఏ కాలువ, నదుల్లో నదీ స్నానం చేయాలని ఉంటే..చక్కగా నులువెచ్చని చలిలో నడిచి వెళ్లి స్నానం చేయటం ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. ఉదయాన్నే లేచి నడటం కూడా ఓ చక్కటి వ్యాయామమే. పైగా నదీ జలాల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరీవాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలి ఈ నీటిలో స్నానం చేస్తే శారీరక ఉత్సాహమే కాకుండా మానసిక ఉత్తేజం కలుగుతాయి.
కార్తీమక మాసం వచ్చేసరికి వర్షాకాలం పూర్తి అయిపోతుంది. వర్షాలు తగ్గిపోతాయి కాబట్టి నదుల ఉధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. ఆ నీటిలో స్నానం నిజంగా చాలా ఆరోగ్యకరమైనది. అటువంటి స్నానానికి కార్తీకమాసమే మంచి అనువైనసమయం. ఇలా కార్తీక స్నానాల గురించి చెప్పుకుంటే ఎన్నెన్నో మానసిక..ఆరోగ్య ప్రయోజనాల మేళవింపులే ఉంటాయి.