Karthika Masam: కార్తీక దీపాలను నీటిలోనే ఎందుకు వదులుతారు..?

P Madhav Kumar

 


శివ పంచాక్షరీ మంత్రం ‘ఓం నమశ్శివాయ’ అనే పంచ బీజాక్షరాల నుంచి పంచ భూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రాలు చెబుతున్నాయి.


karthika masam deepalu : నీరుకు నిప్పు ఈ రెండు విభిన్నవే అయినా ఈ రెండింటికి అవినాభవం సంబంధం ఉంది. నిప్పును ఆర్పే నీరు నిప్పు రెండు కలిసేదే కార్మీక మాసంలోని కార్తీక దీపాలలోని ప్రత్యేకత. నీరు సర్వకోటి జీవాలను ప్రాణాధారం. నీరు లేకపోతే ఏ జీవి ప్రాణంతో ఉండదు. అటువంటి నీటిలో కార్తీక దీపాలను వదలటం వెనుక ఉన్న విశేషమేంటో తెలుసుకుందాం..


ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి.. ఇవన్నీ పంచభూతాలు. వీటిలో నీరు ఎంతటి విలువైనదో…నీటితో పాటు పంచభూతాల్లో అన్ని కూడా సకల ప్రాణికోటికీ జీవనాధారాలే. శివ పంచాక్షరీ మంత్రం ‘ఓం నమశ్శివాయ’ అనే పంచ బీజాక్షరాల నుంచి పంచ భూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రాలు చెబుతున్నాయి.


శివం-పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతామనేది అర్థమవుతుందని వేద పండితులు చెబుతారు. నిజమే శివోహం అనే మూడు అక్షరాల అర్థం,పరమార్థం తెలుసుకోవటమంటే అంత తేలిక కాదు. లయ కారకుడైన శివుడు ఆజ్ఞలేనిదే చీమ కూడా కుట్టదంటారు. అలా శివ పురాణంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలున్నాయి. అష్టాదశ పురాణాల్లో శివ పురాణానికి ప్రత్యేకత ఉంది.


ఆత్మను జ్యోతి స్వరూపం అని చెబుతారు వేద పండితులు. ప్రతీ మనిషిలోను ఆత్మ ఉంటుంది.ఆ ఆత్మజ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందంటారు. దానినే మరణం అని అంటారు. శరీరం నుంచి ఆత్మ వేరుపడితే జరిగేది మరణమే. శరీరానికి మరణం ఉంటుంది గానీ ఆత్మకు మరణం ఉండదంటారు. ఆత్మ జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో వదలటమే ఈ కార్తీక మాసంలోని విశిష్టత. పంచభూతాల్లో ఒకటి అయిన నీటిలో కార్తీక దీపాలను వదలటం అంటే సాక్షాత్తు లయకారకుడైనా ఈ పరమేశ్వరుడికి అంకిత ఇవ్వటమే.


ఈశ్వరుడికి జ్యోతి అంటే చాలా ఇష్టం. అది కార్తీకమాసంలో అయితే ఇంకా ప్రీతికరం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ప్రస్తుత జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతారని నమ్ముతారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు. అలాగే కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన జాజి, అవిసెపువ్వు, గరిక, బిల్వ దళాలు, జిల్లేడు పూలతో పూజిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయంటారు. కార్తీక దీపాలకు కూడా ఈ పూలతో పూజిస్తే సర్వసుఖాలు కలుగుతాయని వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందంటారు.


శివుడిని అర్థం చేసుకుంటే సత్యమేంటో తెలుస్తుందంటారు. గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మక మైన సమస్తమూ రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు. ఆనంద మూర్తి. ఆదిత్య వర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు. సర్వుడు. ఆయన లేని చోటు లేదంటారు. అటువంటి పరమేశ్వరుడి కన్న పెద్ద గానీ, చిన్న గానీ, సాటి గానీ ఎవరూ లేరని శివతత్వం తెలిసిన గొప్ప గొప్ప పండితులు చెబుతుంటారు.


ఏదేవుడికి లేనటువంటి ఓ ప్రత్యేకత శివుడికి ఉంది. అదే లింగాకారం. ఏ శివాలయంలోనే అయినా శివుడు విగ్రహం రూపంలో కంటే లింగాకారంలోనే దర్శనమిస్తాడు. శివుడిని 12 జ్యోతిర్లింగ రూపాలలో వున్నాడని నమ్మి కొలుస్తారు. జ్యోతిర్లింగ అంటే చీకటిని (అజ్ఞానాన్ని) చీల్చి వెలుగు…( జ్ఞానాన్ని) ప్రసాదించేది. శివ లింగం పైకి లింగం కింద పానవట్టం యోని రూపంలో వుంటుంది. అది స్త్రీ పురుషుల ప్రతీక. ఒకటి లేనిది ఇంకొకటి లేదు.అవినాభావ సంబంధం. ఇలా శివతత్వం గురించి చెప్పుకుంటు పోతే దానికి అంతే ఉండదంటారు. అదో అనంతం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat