కొలువై యున్నాడు వీడే గోవింద రాజు
కొలకొల నేగి వచ్చే గోవింద రాజు
కొలువై యున్నాడు వీడే గోవింద రాజు
కొలకొల నేగి వచ్చే గోవింద రాజు
1. గొడుగుల నీడల గోవింద రాజు
గుడిగొన్న పడగల గోవింద రాజు
కుడి ఎడమ కాంతుల గోవింద రాజు
కోడి సాగే పవజుల గోవింద రాజు
కొలువై యున్నాడు వీడే గోవింద రాజు
కొలకొల నేగి వచ్చే గోవింద రాజు
2. గొప్ప గొప్ప పూదండల గోవింద రాజు
గుప్పేటి వింజామరల గోవింద రాజు
కొప్పుపై చుంగుల తోడి గోవింద రాజు
కుప్పి కటారముల తోడి గోవింద రాజు
కొలువై యున్నాడు వీడే గోవింద రాజు
కొలకొల నేగి వచ్చే గోవింద రాజు
3. గోరబు సింగారాల గోవింద రాజు
కురులు దువ్వించు కొని గోవింద రాజు
తిరుపతి లోనను తిరమై శ్రీ వేంకటాద్రి
గురిసీ వరము లెల్ల గోవింద రాజు
కొలువై యున్నాడు వీడే గోవింద రాజు
కొలకొల నేగి వచ్చే గోవింద రాజు