_*🚩అయ్యప్ప చరితం - 11 వ అధ్యాయం🚩*_

P Madhav Kumar


🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️


సంతోషంతో తిరిగి వచ్చి వరగర్వంతో విజృంభించి స్వర్గాన్ని ఆక్రమించింది మహిషి !  భూలోకంలో తన శాసనాన్ని అమలు చేసింది.


*‘‘ఇప్పటికి నా పగ చల్లారింది !  నా సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాను. హ.. హ.. హ! ఇక మూడు లోకాలలో నన్ను ఎదిరించే వారు లేరు!’’* అంటూ యధేష్టంగా వివరిస్తూ అందరినీ భయభ్రాంతులను చేయసాగింది మహిషి .


*‘‘తండ్రీ !  మీరిచ్చిన వరప్రభావంతో మహిషిలో గర్వాహంకారాలు విజృంభించి ఆమె చేస్తున్న దురాగతాలు హద్దుమీరిపోతున్నాయి. హరిహరులు , జగన్మాత కూడా చూస్తూ వున్నారు గానీ ఏ విధంగాను ఆ మహిషిని నిర్జించే మార్గం తెలియజేయటం లేదు. ఈ పరిస్థితిలో మీరే మాకు తరుణోపాయం తెలియజెప్పాలి!’’* అంటూ బ్రహ్మ దగ్గరకు వచ్చి దీనంగా మొరపెట్టుకున్నారు ఇంద్రాది దేవతలు.

వాళ్లవైపు చిరునవ్వుతో చూస్తూ అభయం ప్రసాదించాడు బ్రహ్మదేవుడు.


*‘‘దేవతలారా !  నిరాశ చెందకండి !  ప్రస్తుతం మహిషి తన కఠోర తపస్సుకు ఫలంగా సుఖభోగాలనుభవిస్తున్నది.  ఆమె కోరిక అసాధారణ కోరిక తీరే సమయం కూడా దగ్గరపడుతున్నది. ఆ విషయం ఆమెకు తెలియకుండా ఉండడానికి తాత్కాలికంగా ఆమె దృష్టిని మరల్చే సమర్థుడు రాబోతున్నాడు! అలా చూడండి!’’* అంటూ కళ్లు మూసుకుని ద్యానించాడు.

దేవతలందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా సుందరదత్తుడు అక్కడకు వచ్చిన బ్రహ్మకు నమస్కరించాడు.


*‘‘సుందరదత్తా !  నీవల్ల కావలసిన దైవకార్యం ఒకటి వున్నది !  నీ శాపం చేత నీ భార్య లీలావతి మహిషిగా జన్మించి స్వర్గ , మర్త్యలోకాలలో శాంతి భద్రతలు కరువయ్యేలా చేస్తున్నది.  నీవు వెంటనే సుందర మహిష రూపాన్ని ధరించి ఆమె ఆగడాలు అరికట్టడానికి ప్రయత్నించవలసింది’’* అని ఆదేశించాడు బ్రహ్మదేవుడు.


*‘‘మీ ఆజ్ఞ శిరసావహిస్తాను !  కానీ విధాతా !  మోక్షాన్ని కోరి నేను చేస్తున్న తపస్సు విఘ్నమవడం నాకు చాలా విచారాన్ని కలిగిస్తున్నది. ఆమెనుండి నాకెప్పుడూ విముక్తి లభిస్తుందో తెలియజేయండి!’’* అని వేడుకున్నాడు సుందరదత్తుడు.


*‘‘దత్తా !  నీ తపస్సు భంగమైనందుకు విచారించవద్దు !  లీలావతి నీకిచ్చిన ప్రతి శాపాన్ని అనుభవించేవరకు నీ కర్మ పరిహారం కాదు ! అందుచేత మహిష రూపంలో ఆమెతో కలిసివున్నా నీ మనస్సు ఇంద్రియాలకు అతీతంగా ఎప్పుడూ ముక్తస్థితిలోనే వుంటుంది !  నీ కార్యం పూర్తవగానే నీవు పరమాత్మలో ఐక్యం కాగలవు!’’* అని సమాధానపరిచాడు బ్రహ్మదేవుడు.


దత్తుడు సుందర మహిష రూపాన్ని పొంది మహిషి నివాసాన్ని చేరుకున్నాడు అల్లంత దూరం నుండి మహిషాన్ని చూస్తూనే మహిషిలో ఆనందం పొంగివచ్చింది.  పరుగు పరుగున అతడిని చేరింది! స్వర్గ్భోగాలను , పరివారాన్ని విడిచి తనను కవ్విస్తున్న సుందర మహిషం వైపు అడవిలోకి వెళ్లిపోయింది. అక్కడ ఆ జంట ఏకాంతాన్ని భంగపరిచే వారు లేరు ! బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కొన్ని సంవత్సరాలు ఆనందంగా విహరిస్తూ గడిపేసారు.


*‘‘మహిషి బెడద తాత్కాలికంగా తీరినా దాని అంతం మాత్రం మీ ఇరువురికి జన్మించే పుత్రుని చేతిలో మాత్రమే వుంది గదా ! హరిహరులారా !  ఇద్దరు పురుషులకు పుత్రుడు జన్మించే అవకాశం లేదనీ ,  అది ప్రకృతి విరుద్ధమనీ తెలిసే అటువంటి వరం కోరింది ఆ మహిషి !  ఆ అసాధ్యమైన కార్యం ఎట్లా సాధ్యవౌతుంది ? మహిషి మరణం ఏ విధంగా సంభవిస్తుంది స్వామీ’’* కుతూహలంగా హరిహరులవైపు చూస్తూ ప్రశ్నించాడు నారదుడు.


అవును స్వామీ ! సుందర మహిషాన్ని కూడి వున్న మహిషి ఎప్పుడు తిరిగి విజృంభిస్తుందో తెలియదు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat