**
*1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము*
*కల్యాణాద్యుత్సవములు*
🍃🌹అంతట శ్రీమలయప్పస్వామివారు పట్టమహిషులగు శ్రీభూదేవులతో కల్యాణాద్యుత్సవ నిర్వహణార్థమై మహారాజమర్యాదలతో రంగమండపమునకు వేంచేయుదురు. అచ్చట శ్రీవారికి కల్యాణాద్యుత్సవములు, జరుపబడును.
*🌻సర్వదర్శనము🌻*
🍃🌹ఇచ్చట శుక్రవారాభిషేకము జరిగి విచిత్రాలంకార విభూషితులై వేంచేసియున్న శ్రీస్వామివారి సన్నిధానమున భక్తులకు సర్వదర్శనము జరుగుచుండును.
*🌻శుద్ధి🌻*
🍃🌹శ్రీవారికి సాయంకాలారాధన సమయము కాగానే సర్వదర్శనము ఆపివేయబడి శుద్ధిజరుగును.పిమ్మట మామూలుమేరకు శ్రీవారికి సాయంకాలారాధనము ఏకాంత సేవ క్రమముగా జరిగి కోవెల తీర్మానము జరుగును. ఇదియే శుక్రవార కార్యక్రమము.
*🌻దైనందిన కార్య సంగ్రహము🌻*
🍃🌹1. శ్రీ తిరుమల శ్రీస్వామివారి ఆలయము తలుపులు ప్రతినిత్యము (20) ఇరువది గంటలకాలము తెరువబడి యుండును.
🍃🌹2. విశేష దినములయందు మరియు రెండు గంటల కాలము తెరవబడియుండును.
🍃🌹3. శ్రీవారికి ప్రాతఃకాలమునందు మధ్యాహ్న కాలమునందు సాయంకాలము నందు ఈ మూడు కాలములయందును శ్రీ వైఖానస శాస్త్ర ప్రకారము ఆరాధనము జరుగుచుండును.
🍃🌹4. రాత్రి పూజాన్తమునందు, తలుపులు మూసిన తరువాత బ్రహ్మాది దేవతలు వచ్చి ఆరాధించుటకు తీర్థాది సౌకర్యములు చేయబడును.
🍃🌹5. ఉదయమున విశ్వరూప దర్శనములో బ్రహ్మపూజా ప్రాప్తమైన శ్రీవారి తీర్థమును విశ్వరూప సేవా పరాయణులగు వారలకు వినియోగము జరుగుచుండును.
🍃🌹6. ప్రతి దినమునందును ఆరాధనములు పూర్తి అయిన తరువాత సర్వదర్శనము జరుగుచుండును.
🍃🌹7. ఒక్కొక దినమున సర్వదర్శనములో శ్రీవారిని వేలమందికి పైగా దర్శించుచుందురు.
🍃🌹8. ఒక్కొక దినమున శ్రీవారికి యాత్రికులు లక్షలకు పైగా కానుక లర్పించుచుందురు.
🍃🌹9. ఒక దినమున ఒక యాత్రికుడు శ్రీవారికి యాభై లక్షలు కానుకగా యిచ్చుటకూడా కలదు.
🍃🌹10. శ్రీవారికి భారతీయులేకాక విదేశీయులు కూడా వేలకొలది కానుకలు పంపుచుందురు.
🍃🌹11. ఫలార్థులగు యాత్రికులు భక్తులు ప్రార్థనా ఫలములను పొందియే శ్రీవారికి ప్రార్థనలను సమర్పించుచుందురు.
*“ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన!*
*వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి ||*
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*