*భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ*" - 18వ భాగము

P Madhav Kumar

నీవు చేసే ప్రతికర్మ నిష్కామంతో ఆచరించు. త్వరలోనే చిత్తశుద్ధికలిగి జ్ఞానముదయిస్తుంది. జ్ఞానముతో కూడిన అభ్యాసంతో పరమాత్మని తెలుసుకోవడము చాల సులభము. తద్వారా ఈ జన్మలోనే జీవన్ముక్తిని పొందగలవు - జగద్గురువు శ్రీకృష్ణపరమాత్మ. 


అష్టాంగమార్గ విధానంతో ధర్మాన్ని అనుసరిస్తూ, సంఘసేవద్వారా బుద్ధుడవై సత్యాన్ని గ్రహించు - శ్రీ గౌతమ బుద్ధుడు.


అహింసయే ఉత్తమమైన ధర్మము. అంతకు మించిన ధర్మములేదు. అహింస ద్వారా భగవంతుని తెలుసుకోవడం చాల సులభము - శ్రీ మహావీర జైన్.


ప్రేమతో కూడిన సమస్తజీవుల సేవద్వారా పరిశుద్ధాత్ముడవై ఆ తండ్రిని చేరుకో - శ్రీ జీసస్ క్రైస్ట్. 


తిధి, వార, నక్షత్రములను నమ్మి మానవులు వివిధ కార్యములు చేయుదురు, కానీ "తత్త్వమసి" (ఆ పరమాత్మయే నీవు) అను శృతి వాక్యమును మాత్రము నమ్మరు - శ్రీ అది శంకరాచార్యులు.


పరమాత్మను పొందటానికి అందరూ అర్హులే, ఎందుచేతనంటే అందరిని సృష్టించింది ఆయనే. ఆయన నామాన్ని ఆశ్రయించి ఎల్లవేళలా భక్తితో జపిస్తే అతని దివ్యసన్నిధికి అతి సునాయాసంగా చేరుకోవచ్చు - శ్రీ రామానుజాచార్యులు.


భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో ఆ పరమాత్మను అనుక్షణం సేవిస్తే, అతని దర్శనము అతి సులభంగా లభిస్తుంది - శ్రీ మధ్వాచార్యులు.


శాంతి, సౌభాతృత్యముతో ఇతరులను సేవించడం ద్వారా అల్లాహ్ ను దర్శించవచ్చు - శ్రీ మహమ్మద్ ప్రవక్త(Peace be upon Him).


We trust the man in the street, but there is one being in the universe we never trust and that is God” - "దారినపోయే మనిషిని మనము నమ్మెదము, కానీ ఈ జగత్తునందు మనము యెన్నటికి నమ్మని ఒక వ్యక్తి కలడు. అతడే భగవంతుడు" - స్వామి వివేకానంద.


శ్రద్ధ, సబూరీలతో నిన్ను నీవు తెలుసుకో. ఎందుకు వచ్చినట్లు. పిడకలు ఏరుకోడానికా - సమర్ధ సద్గురువు శ్రీ సాయినాథుడు.


లోకమున అదే జరుగుచున్నది. నేనే బ్రహ్మమును (అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ) అని శ్రుతులు పదేపదే చెబుతున్నా జీవులకు నమ్మకం కుదరడంలేదు. కారణము మాయ, అజ్ఞానము. ఇవి పూర్తిగా తొలగితేతప్ప జ్ఞానము ఉదయించదు - శ్రీ రమణమహర్షి.


సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ద్వార మాత్రమే ఆత్మజ్ఞానము కలుగుతుంది. నీవు ఏ కార్యము చేసినా భగవంతునికి అర్పించు - కంచిపరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి.


ఇలా ఎంతోమంది మహానుభావులు ఈ ధరణిలో అవతరించి, శ్రద్ధతో ఆచరించి, సత్యాన్ని గ్రహించి, లోకకళ్యాణార్ధమై తోటి జనులకు ఆయా మార్గాలను బోధించారు. మనుజులు శ్రద్ధతో ఏ మార్గమును అవలంబించినా అసలు సత్యమును గ్రహించవచ్చు.

                                                    

🪷⚛️✡️🕉️🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat