*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻19. శ్రీవరాహజయని ఉత్సవము🌻*
🍃🌹సర్వ జగన్నియమ నాధ్యక్షుడై (తిరుమల) పుణ్య భూధరమగు శ్రీ వేంకటాద్రియందు అర్చావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మాననీయుడగు శ్రీ వరాహస్వామివారికి ప్రతి సంవత్సరము శ్రావణమాసమున శ్రవణనక్షత్రము శుభవాసరమున జయనీ ఉత్సవము జరుగును.
🍃🌹ఆ దినమున శ్రీ స్వామివారికి రాత్రి కైంకర్యములు జరిగి తీర్మానమునకు ముందుగా అర్చకస్వాములు, పాచకులు, పరిచారకులు మొదలగు కైంకర్యపరులు అందరూ శ్రీ వరాహస్వామివారి సన్నిధానమునకు వచ్చెదరు. అచ్చట శ్రీవరాహస్వామివారికి ఆరాధనము ప్రసాదతళియలు నివేదనము జరుగును. హారతి అయిన పిమ్మట ఆరగింపు అయిన ప్రసాదములు స్థానబహుమాన పూర్వకముగా గోష్ఠికి వినియోగము జరుగును. పిమ్మట కైంకర్యపరులు శ్రీవారి సన్నిధానమనకు వచ్చెదరు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*