శ్రీ వేంకటేశ్వర వైభవం - 20 🌻4. కల్యాణోత్సవము🌻

P Madhav Kumar


*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*


*🌻4. కల్యాణోత్సవము🌻*


🍃🌹సకల కల్యాణగుణాకరుడై, 'సకల కల్యాణ ప్రదాతయగు తిరుమల యందు వేంచేసియున్న శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రతినిత్యము భక్తజన ప్రార్థనా పూర్వకముగ కళ్యాణోత్సవములు జరుగును.


🍃🌹కల్యాణ ప్రార్థనానిర్వహణ కాముకులై భక్తాగ్రేసరులగు యజమా నులు కళత్ర పుత్రమిత్ర బంధు సమేతముగా శ్రీస్వామివారి రంగమం డవమునకు వచ్చి శ్రీస్వామివారి రాకకై నిరీక్షించుచుండ, శ్రీస్వామివారు ప్రాతఃకాలారాధనమును మాధ్యాహ్నికారాధనమును పూర్తి అయిన వెంటనే తమ పట్టమహిషులగు శ్రీ భూదేవులతో సహ సువర్ణ తిరుచ్చి యందు వేంచేసి వాహనములో ఆనందనిలయ విమాన ప్రదక్షిణముగా పరివారములతో మంగళవాద్యములతో రంగమండపమునకు వేంచేసి భక్త జనము నిర్నిమేషులై అత్యానందముతో చూచుచుండ ఆ వాహనము వీడి శ్రీమలయప్పస్వామివారు ఒక సువర్ణ పీఠమును, శ్రీ భూదేవులు మరియొక సువర్ణ పీఠమును అలంకరించెదరు. 


🍃🌹వెంటనే ఆచార్యుడు కల్యాణ సంబంధమగు వైదిక తంత్రము నారంభించి క్రమముగా శ్రీవారి యొక్కయు శ్రీభూదేవుల యొక్కయు గోత్ర ప్రవర పూర్వకముగా మంగళసూత్రధారణము మొదలగు కల్యాణ ధర్మము లను నడిపించెదరు. పిమ్మట శ్రీవారు శ్రీభూదేవులు పుష్పమాలికలను మార్చుకొందురు. శ్రీవారి పార్శ్వమున శ్రీభూదేవులు తమ స్వస్థానము నలంకరించెదరు. పిదప అక్షతారోపణము సదస్సు జరుగును. పిమ్మట శ్రీవార్లకు ప్రసాద నివేదన జరిగి యజమానులకు వస్త్రాది బహుమాన ములు జరుగును, తరువాత యజమానులు ధర్మపత్నీ సమేతులైన శ్రీవార్లను సేవించి కృతార్థులై మర్యాదలతో తమ తమ స్వస్థానముల ప్రవేశించెదరు.


*🌻5. సహస్ర కలశాభి షేకోత్సవము🌻*



🍃🌹దేవదేవుడగు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తజన ప్రార్థనా పూర్వకముగా ప్రతి బుధవారము సహస్ర కలశాభిషేకోత్సవము జరుగును. శ్రీవారికి ఆరాధనము అయిన పిమ్మట బంగారు వాకిలి ముందు ఆరాధన మండపమున ఏర్పరచిన ప్రత్యేక స్నానపీఠములయందు శ్రీ భోగ శ్రీనివాసస్వామివారు, శ్రీ భూదేవులతోటి శ్రీమలయప్పస్వామి వారు, శ్రీ సేనాధిపతులవారు వేంచేయుదురు. వెంటనే బంధు, పుత్ర, మిత్రాదులతో కూడిన అభిషేక ప్రార్థనా కాముకులగు యజమానులతో అధి కారులతో కూడిన భాగవత గోష్ఠి యందు ఆచార్యులవారు అభి షేక సంబంధమగు వైదిక ప్రక్రియ ప్రారంభించి తీర్థపూర్ణములగు సహ స్రకలశములను నవకలశములను సంస్కరించెదరు.


🍃🌹తరువాత హోమములు జరిపి వేద ఘోషలతో అభిషేకము ప్రారంభమై అంతమున నవ కలశతీర్థముతో సహస్రధారాభి షేకము జరుగును. దీనిని దర్శించి తీర వలెను. శ్రీవారలు వస్త్రాభరణాదులచే నలంకరింపబడి నివేదన జరిగి అక్షతారోపణము జరుగును. యజమానులకు దర్శనము బహుమా నము జరిగి స్వస్థానముల ప్రవేశించెదరు.


*🌻6. రోహిణీ నక్షత్ర ఉత్సవము🌻*


🍃🌹అఖిలజగన్నిర్మాణచతురుడై శ్రీ శేషాద్రియందు వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానములో శ్రీ రుక్మిణీతాయార్లతో సాక్షాత్కరించుచున్న శ్రీకృష్ణస్వామివారికి ప్రతి రోహిణీ నక్షత్రమునం దును ఉత్సవము జరుగును. రోహిణి నక్షత్రమందు స్వామివారికి ప్రాతఃకాలారాధనము, మాధ్యాహ్నికారాధనము పూర్తి అయిన తరు వాత శ్రీకృష్ణస్వామివారు శ్రీ రుక్మిణీతాయార్ల వారితో సహా తిరుచ్చిలో వేంచేయుదురు. వెంటనే విశేషములగు కౌశేయాది వస్త్రములతో ను రత్నాభరణములతోను ఋణతర్పణమగు పరిమళములచే పూరితములగు పుష్పమాలికలచేతను శ్రీకృష్ణస్వామివారికి శ్రీరుక్మిణీ అమ్మవారికి అలం కారము జరుగును. కర్పూరహారతి జరుగును. 


🍃🌹వెంటనే చతుర్విధుల ఉత్సవమునకు బయలుదేరుదురు. మంగళవాద్యములతోను, పరివారము లతోను, శ్వేతచ్ఛత్రములతోను, వేదవేత్తల వేదపారాయణముతోను, దివ్య ప్రబంధవేత్తల దివ్య ప్రబంధపారాయణములతోను హస్త్యశ్వాది చతురంగములతోను యాత్రిక భక్తబృందములతోను చతుర్వీధులు ఉత్సవము పూర్తి అయి శ్రీ శ్రీ స్వామివార్ల యొక్క బంగారు వాకిలి ముందు ఆస్థానమండపములో వేంచేయుదురు. అచ్చట శ్రీకృష్ణస్వామివారికి శ్రీ రుక్మిణీతాయార్లకు ఆరాధనము ప్రసాద నివేద నము జరిగి కర్పూరహారతి జరుగును. 


🍃🌹వెంటనే జియ్యంగారువారికి సర్కారువారికి బహుమానము జరిగి ఆస్థాన బహుమాన పూర్వకముగా గోష్ఠికి చందన తాంబూల ప్రసాద వినియోగము జరుగును. శ్రీ కృష్ణస్వామివారు, శ్రీ రుక్మిణీ తాయార్లు లోపలికి వేంచేయుదురు.


   *🙏ఓం నమో వేంకటేశాయ🙏*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat