శ్రీ వేంకటేశ్వర వైభవం - 23 🌻11. శ్రీరామపట్టాభి షేకాస్థానోత్సవము🌻

P Madhav Kumar


*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*


*🌻11. శ్రీరామపట్టాభి షేకాస్థానోత్సవము🌻*


🍃🌹భక్తజన సంరక్షణార్థమై సప్తాచలమునందు (తిరుమల) అర్చావతా రమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమున ప్రతి సంవత్సరం చైత్రశుద్ధదశమీ శుభవాసరమున శ్రీరామచక్రవర్తి స్వామివారికి పట్టాభి షేక మహోత్సవ నిమిత్తమగు ఆస్థానము జరుగును.


🍃🌹శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రాతఃకాలారాధనము మాధ్యాహ్నికా రాధనము పూర్తి అయిన పిమ్మట సాయంకాలము శ్రీ సీతారామలక్ష్మ ణులను ఒక సువర్ణ తిరుచ్చిలోను, ఆంజనేయస్వామి వారిని వేరొక తిరు చ్చిలోను వేంచేపుచేసి విశేషాభరణములతో విశేష కౌశేయములతోను పుష్పమాలికలతోను అలంకరించెదరు. శ్రీరామస్వామివారికి శ్రీ ఆంజనే యులవారు అభిముఖముగా నుండునట్లు యేర్పాటు చేసి చతుర్వీథు లలో స్వపరివారములతో మంగళవాద్యములతో ఉత్సవము జరుగును. పిమ్మట శ్రీస్వామివారి బంగారువాకిలి ముందుగల ఆస్థానమండపములో సర్వభూపా లవాహనములో వేంచేయుదురు. కపికుల చక్రవర్తియగు సుగ్రీవుడు, యువరాజగు అంగదుడు, శ్రీ ఆంజనేయస్వామివారు శ్రీవారికి ఎడమపార్శ్వములో దక్షిణాభి ముఖముగా వేరు పీఠముల మీద వేంచేయుదురు. 


🍃🌹ఆచార్యర్చక పరిచారక యజమానులతోటియు, పరివారములతోటియు, భక్తజనముతోటియు నిండి ప్రకాశించు ఆ ఆస్థానమందు, శ్రీవార్లకు ఆరాధనము ఆరగింపు జరుగును. ' తరువాత' త్రేతాయుగమున, అయోధ్యానగరమున అవతరించి దుష్ట శిక్షణము శిష్టరక్షణము కావించి పిదప అయోధ్యానగరము నందు ఛత్ర చామరాది కైంకర్యపరులైన లక్ష్మణ భరతశత్రుఘ్నుల తోటియు, విభీష ణాది రాక్షసవీరులతోటియు, సుగ్రీవాంగద జాంబవద్దనుమదాది వాన రవీరులతోటియు బ్రహ్మేంద్రాదులతోటియు, దేవబృందములతోటియు, వశిష్ఠవామదేవవాల్మీకి విశ్వామిత్ర మార్కండేయాది మహర్షులతోటియు, మహారాజులతోటియు పౌరజన సహస్రములతోటియు, నిండి ప్రకాశించుచున్న నిండు పేరోలగమునందు లోక రక్షణార్థమై శ్రీసీతాదేవీ వార్లతో రత్నఖచిత సింహాసనము నలంకరించిన ఇనకుల తిలకుడగు శ్రీరామ చక్రవర్తి యొక్క పట్టాభి షేకమంగళములను పౌరాణికులు శ్రీరామ పాదారవిందముల యందున్న శ్రీమద్రామాయణమును అర్చకులు వారి చేతికి యివ్వగా పురాణ కాలక్షేపము చేయుదురు. 


🍃🌹ఆ సమయమున శ్రీరామచక్రవర్తి వారి పాదారవిందముల యందున్న పుష్పమాలికలను రత్నహారములను సుగ్రీవాంగద ఆంజనేయస్వామి వార్లకు సమర్పించెదరు. మర్యాదలు జరుగును. పిమ్మట పౌరాణి కులకు బహుమానము జరుగును. తరువాత హారతులు జరిగి శ్రీ జియ్యంగారికి సర్కారు వారికి బహుమానము జరుగును. తరువాత చందన, తాంబూల ప్రసా దవినియోగము, ఆస్థాన మర్యాద పూర్వకముగా గోష్ఠికి జరుగును. వెంటనే శ్రీవారు శ్రీ స్వామివారి సన్నిధి లోనికి వేంచేయుదురు.


   *🙏ఓం నమో వేంకటేశాయ🙏*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat